English | Telugu

బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ టైం డాన్స్ చేసిన కళ్యాణ్,తనూజ

బిగ్ బాస్ సీజన్ 9 ఐపోయాక విన్నర్ కళ్యాణ్ పడాల, రన్నరప్ గా నిలిచిన తనూజ మొదటిసారి స్టార్ మాలో సంక్రాంతి వేడుకలో సందడి చేయడానికి రాబోతున్నారు. "మా సంక్రాంతి వేడుక" పేరుతో ఆ ప్రోమో రిలీజ్ అయ్యింది. వీళ్ళిద్దరూ కలిసి "ఛాంపియన్" మూవీలోని సూపర్ డూపర్ హిట్ ఐన "గిరగిరగిర" సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక ఈ ఈవెంట్ లో "సీరియల్ సూపర్ స్టార్స్, బిబి బ్లాస్టర్స్, వీకెండ్ ఎంటర్టైనర్స్ ఆర్ యు రెడీ..ఆడియన్స్ ఏంటి మరి సంగతి..ఇరగదీద్దాం ఈ సంక్రాంతి" అంటూ శ్రీముఖి గట్టిగా ఇంట్రో ఇచ్చింది. ప్రభాకర్, నిరుపమ్ పరిటాలను చూసిన హరి "వీళ్ళిద్దరినీ పెట్టి నెక్స్ట్ సంక్రాంతికి సినిమా తీస్తే వంద కోట్లుకి వెయ్యి కోట్లు వస్తాయి సర్" అన్నాడు. "ఈ ఇద్దరూ ఫాదర్ క్యారెక్టర్స్ కి ఓకే మరి హీరో ఎక్కడా" అంటూ సెటైర్స్ వేసాడు అవినాష్. తర్వాత నిఖిల్ ని చూసిన శ్రీముఖి "ఈ అబ్బాయిని పెట్టుకుని మంచి బ్రేకప్ స్టోరీ చేశారనుకోండి థియేటర్ లో కటింగ్లే కటింగ్లు " అంటూ చెప్పింది.

తర్వాత కళ్యాణ్ పడాల, ఇమ్మానుయేల్, డెమోన్ పవన్ ని పెడితే మంచి టైటిల్ ఉంది మన దగ్గర అన్నాడు హరి. ఏంటది అన్నారంతా. "అన్నయ్యకు ఆశీస్సులు, తమ్ముళ్లకు సూటుకేసులు అని అన్నాడు హరి. ఇక బిగ్ లవ్ స్టోరీ పేరుతో రాహుల్ సిప్లిగంజ్ తన వైఫ్ గురించి చెప్పుకొచ్చారు. "అసలు ఈ కలయిక ఎప్పుడు మొదలయ్యింది" అని శ్రీముఖి అడిగింది. "నిన్ను నన్ను నాగ్ సర్ రెండు చేతులు పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు కదా తర్వాత నీ చెయ్యి ఒకళ్ళ చేతిలో పెట్టాడు నా చేతిని ఈమె చేతిలో పెట్టాడు" అని చెప్పాడు. తర్వాత కళ్యాణ్ - తనూజ డాన్స్ చేస్తూ వచ్చేసరికి "మీకెవ్వరికీ ఎవరి దిష్టి తగలకూడదమ్మా" అన్నాడు ఇమ్మానుయేల్. "ఫస్ట్ నీ దృష్టే తగిలేలా ఉంది" అంటూ ఇమ్మానుయేల్ కి కౌంటర్ వేసాడు హరి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.