English | Telugu

Guppedantha Manasu: రొమాంటిక్ గా రిషి.. మాస్ వార్నింగ్ ఇచ్చిన వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -918 లో.. రిషి ప్రేమగా వసుధారకి జూమ్కాలు తీసుకొని వచ్చి.. వసుధార చెవికి పెడుతుండగా జూమ్కా కిందపడిపోతుంది. రిషి జుమ్కా తీసుకొని దాచేసి, జుమ్కా కన్పించడం లేదంటూ సరదాగా ఆటపట్టిస్తాడు. ఆ తర్వాత జుమ్కా వసుధారకి పెడతాడు. ఇద్దరు సెల్ఫీ తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. కాసేపటికి మీరు మళ్ళీ ఎండీ సీట్ లో కూర్చొని బాధ్యతలు తీసుకుంటారా అని వసుధార అడుగుతుంది. నేను ఎప్పుడు నీ ఎండీనే అని రిషి అనగానే.. మీరు ఎప్పుడు నా ఎండీ అని వసుధార అంటుంది. అలా అనగానే ఒక్కసారి నా మొహం చూసి చెప్పమని వసుధార దగ్గరికి తీసుకొని రిషి వస్తుంటాడు. అలా రొమాంటిక్ గా రిషి అడిగేసరికి వసుధార మెలికలు తిరిగిపోతుంది.

మరొక వైపు విశ్వనాథ్ దగ్గరకు అనుపమ వచ్చి.. నేను ఓల్డ్ స్టూడెంట్స్ అందరితో ఒక అల్యూమిని ప్రోగ్రామ్ చేద్దామని అనుకుంటున్నానని అనుపమ అనగానే.. నీ ఇష్టం నీకు నచ్చినట్టు చెయ్. నా తర్వాత ఈ ఆస్తులని చూసుకునేది నువ్వే కదా అని విశ్వ నాథ్ అనుపమతో అంటాడు. ఒకవైపు రిషి, వసుధార ఒళ్ళో పడుకొని సరదాగా కబుర్లు చెప్తుంటాడు. నీకు ఎప్పుడైన ఏంజిల్ గురించి, నా గురించి అనుమానం వచ్చిందా అని రిషి అనగానే.. వసుధార ఒక్కసారిగా లేచి అలిగి వెళ్ళిపోతుంది. ఏమైందని రిషి అనగానే.. మీరు అడగవలసిన మాట అదేనా? మిమ్మల్ని అనుమానిస్తే నేను వసుధారని కాదంటూ బుంగ మూతి పెట్టి అలుగుతుంది. సారి చెప్పిన వసుధార అంగీకరించదు. ఏం కావాలి సారీ సారీలు తీసుకోవాలా అంటూ బుజ్జగిస్తుంటాడు. అయిన వసుధార బెట్టు చేస్తుంది. వసుధార సారీ అంటూ గట్టిగా అరుస్తుంటాడు రిషి. మామయ్య నిద్ర లేస్తాడని వసుధార అంటుంది. మరి నా సారీ యాక్సెప్ట్ చెయ్ అని రిషి అంటాడు. అయిన వసుధార యాక్సెప్ట్ చెయ్యదు. డాబా పైకి వెళ్లి గట్టిగా సారీ అని అరుస్తూ ఉంటాడు. అందరి నిద్ర డిస్టబ్ చేస్తానని రిషి అనగానే.. ఇది వరకు రిషి థాంక్స్ యాక్సెప్ట్ చెయ్యనందుకు తను ఇలా చేసింది గుర్తుకు చేసుకుంటుంది వసుధార. ఆ తర్వాత వసు రిషి సారీని యాక్సెప్ట్ చేస్తుంది.

మరుసటి రోజు ఉదయం ఫణింద్రకి రిషి ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు‌. అప్పుడే శైలేంద్ర వచ్చి ఫణింద్ర దగ్గర ఫోన్ తీసుకొని.. మేం వచ్చినపుడు లేరు ఎక్కడకి వెళ్లారని అడుగుతాడు. రిషి ఏదో చెప్పబోతు ఉంటే.. వసుధార వచ్చి మిమ్మల్ని మామయ్య పిలుస్తున్నారంటూ చెప్పగానే.. వసుధారకి రిషి ఫోన్ ఇచ్చి వెళ్తాడు.. ఆ తర్వాత వసుధార, శైలేంద్రల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఫోన్ దేవయాని తీసుకొని వసుధారతో కోపంగా మాట్లాడుతుంది. వసు తగ్గకుండా దేవయానికి కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.