English | Telugu
ఇంటర్వ్యూ మధ్యలో అనిల్ కుమార్ యాదవ్‌కి ఫోన్ చేసిన బండ్ల గణేష్!
Updated : Oct 3, 2022
బండ్ల గణేష్ తరచూ ఏదో ఒక కాంట్రవర్షియల్ కామెంట్ చేసి వార్తల్లో ఉంటూనే ఉంటారు. ఆయన పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఆయనను ఎవరైనా ఏమైనా అంటే వెంటనే రంగంలోకి దిగిపోతారు.లేటెస్ట్‌గాబండ్ల గణేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది."ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ మీకు వార్నింగ్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.ఎందుకు వార్నింగ్ ఇచ్చారు?" అని బండ్ల గణేష్‌ను యాంకర్ అడిగాడు.
వెంటనే అనిల్ కుమార్ యాదవ్‌కు ఫోన్ చేసి,‘హాయ్ అనిల్ అన్నా.. మీరు నాకు వార్నింగ్ ఇచ్చారా? ఒక ఇంటర్వ్యూ జరుగుతోంది, అందులో అడుగుతున్నారు’ అని అడిగారు గణేశ్. అందుకు మాజీ మంత్రి.. ‘నేను నీకు ఎందుకు వార్నింగ్ ఇచ్చాను అన్న’ అంటూ జవాబిచ్చేసరికి "ఐ లవ్ యు అన్నా" అని చెప్పి బండ్ల గణేష్ ఫోన్ పెట్టేశారు.
ఏ విషయం నచ్చకపోయినా ట్వీట్స్ చేస్తాను అని చెప్పారు బండ్ల గణేష్. అలాగేపవన్ కళ్యాణ్‌ని ఎవరు ఏమన్నా భరించలేనని చెప్పారు. ఇక ఆంధ్ర రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. తమ కుటుంబం 50 ఏళ్ల క్రితం తెలంగాణకు వచ్చిందని.. షాద్‌నగర్ తన సొంత ఊరు అని చెప్పుకొచ్చారు.