English | Telugu

సుమ పోలీసుస్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చిన సింగర్ కారుణ్య!


చూసినవాళ్లెవరైనా సరే క్యాష్ షోని కడుపుబ్బా నవ్వుకునే షో అనే అనుకుంటారు. ప్రతీ వారం కొంతమందిని షోకి తీసుకొచ్చి కామెడీతో పాటు క్వశ్చన్స్ అడిగి ఎంటర్టైన్ చేస్తుంది. ఇక నెక్స్ట్ వీక్ క్యాష్ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈసారి షోకి సింగర్స్ ని తీసుకొచ్చింది సుమ.

శ్రీకృష్ణ, మాళవిక, పర్ణిక, కారుణ్య. వీళ్ళు పాటలే పాడతారనుకుంటాం కానీ కామెడీ చేస్తారని అస్సలు అనుకోము కానీ ఈ ఎపిసోడ్ చూసాక వీళ్ళు చేసే కామెడీ అర్థమైపోతుంది. శ్రీకృష్ణని స్టేజి మీదకి పిలిచి "మణిశర్మ, కోటి గారు వీళ్ళ ఇద్దరిలో ఎవరినుంచి మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారంటూ" అడిగేసరికి "కోటి గారు నా గాడ్ ఫాదర్" అని శ్రీకృష్ణ అనేసరికి అంటే "మణిశర్మ గారు ఏం చేయలేదనా" అన్నట్టుగా సుమ సీరియస్ అయ్యేసరికి "మణిశర్మ గారి దగ్గర పాటలు పాడడం నేర్చుకున్నా కాబట్టే ప్రపంచంలో ఎక్కడైనా పాడగలుగుతున్నా " అని ఆన్సర్ ఇచ్చారు. ఇక ఈ షోలో "సుమ పోలీస్ స్టేషన్" పేరుతో ఒక కాన్సెప్ట్ పెట్టింది.

అందులో షోకి వచ్చిన నలుగురి నుంచి కంప్లైంట్స్ తీసుకుంటుంది. ఇంతలో కారుణ్య "నా శృతిపెట్టె పోయింది."అనేసరికి కంప్లైంట్ నోట్ చేసుకో అంటూ కానిస్టేబుల్ కి చెప్తుంది. " సర్ పిట్ట వయసెంత" అని కానిస్టేబుల్ అడిగాడు "కోడిపెట్ట కాదండి ఇది శృతిపెట్టె" అని కారుణ్య క్లారిటీ ఇచ్చేసరికి అందరూ నవ్వేశారు. " ఆ పెట్టెకి ముందు రెండు సొట్టలు ఉంటాయి..మధ్యమం పెడితే పంచమం వస్తుంది పంచమం పెడితే మధ్యమం వస్తుంది.." అనేసరికి "ఆ శృతిపెట్టె పోవడం మంచి పనే అయ్యింది " అని మాళవిక కామెడీ చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.