English | Telugu

శృతి హాసన్ పెట్టుకున్న ఫేక్ నేమ్ ఏంటో తెలుసా ?

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సెమీ ఫినాలే ఎపిసోడ్ ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి శృతి హాసన్ వచ్చింది. ఐతే మొదటగా కూర్మ సహస్ర వచ్చి మంచి పాట పాడి శృతి హాసన్ నుంచి కాంప్లిమెంట్స్ అందుకుంది. ఐతే ఆమె ఒక డౌట్ కూడా అడిగింది. "శృతి అక్క, నేను విన్నాను మీ కాలేజ్ లో పూజ రామచంద్రన్ అని పెట్టుకున్నారని తెలిసింది" అనేసరికి. "కాలేజ్ లో కాదు స్కూల్ లో పెట్టుకున్నా. అది నా ఫేక్ పేరు" అని చెప్పింది. "దాని వెనకాల ఏమన్నా స్టోరీ ఉందా అక్కా" అని అడిగింది. "చిన్నప్పటి నుంచి ఈ పేరుతో చాలా ఇరిటేట్ అయ్యాను.

ఇరిటేషన్ కాదు కానీ కొన్ని సార్లు నన్ను ఇరిటేట్ చేసేవాళ్ళు స్కూల్ . మీరు కమల్ గారి కూతురు కదా.. కమల్ గారు ఎలా ఉన్నారు. రోజూ ఎవరో ఒకరు అడుగుతూనే ఉండేవాళ్ళు. నేను కూడా ఎస్, ఎస్, ఎస్ అని చెప్తూనే ఉండేదాన్ని. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ అడిగేవాళ్ళు. ఈరోజు నాన్న గారు బ్రేక్ ఫాస్ట్ లో ఎం తిన్నారు ?, ఈరోజు నాన్న గారు జిమ్ కి వెళ్ళారా లేదా ? ఆ ప్రశ్నలతో నాకు చాలా బోర్ కొట్టేసేది. ఎందుకు అందరూ నాన్న గురించే అడుగుతారు నా గురించి ఎందుకు అడగరు అని. నేనేం తింటాను ? ఉప్మానా, ఇడ్లీ, వడనా ? అని ఎవరు నన్ను అడగరేంటి అనుకునేదాన్ని. అందుకే నేను ఒక ఫేక్ నేమ్ పెట్టుకోవాలని అనిపించింది. అదే పూజా రామచంద్రన్. ఐనా కూడా నన్ను నువ్వు శృతి హాసన్ కదూ అనే అడిగేవారు. లేదు లేదు నా పేరు పూజా రామచంద్రన్ అని చాలా ఏళ్ళ పాటు నేను అబద్దం చెప్పుకుంటూ వచ్చాను. అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నన్ను పూజా అనే పిలవమని చెప్పేదాన్ని." అని అంది శృతి హాసన్. వెంటనే సహస్ర అడిగింది "ఆ పూజాకి ఈ శృతికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా " అని. "నో బోత్ ఆర్ పిచ్చి సేమ్ ఓన్లీ" అంటూ కామెడీగా రిప్లై ఇచ్చింది శృతి హాసన్.