English | Telugu

Shobha shetty Elimination : శోభాశెట్టి ఎలిమినేషన్..‌ఉల్టా పల్టా అయితే గౌతమ్ అవుట్!

బిగ్ బాస్ సీజన్-7 పదకొండవ వారం ముగింపుకి వచ్చింది. ఇక హౌస్ లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా అందులో యావర్ అత్యధిక ఓట్లతో నెంబర్ వన్ ర్యాకింగ్ లో ఉండగా.. సీరియల్ బ్యాచ్ లోని శోభాశెట్టి చివరి స్థానంలో ఉంది. మరి ఈ వారం బిగ్ బాస్ ట్విస్ట్ లు ఏం చేయకుండా శోభాశెట్టిని ఎలిమినేషన్ చేస్తారా లేక ఉల్టా పల్టా అంటూ ఆ తర్వాత స్థానంలో ఉన్న గౌతమ్ కృష్ణని ఎలిమినేషన్ చేస్తారా అనే సస్పెన్స్ అందరిలో ఉంది.

అసలు నామినేషన్ లో ఉన్న ఎనిమిది మందిలో యావర్ ఈ వారం ' ది బెస్ట్ ప్లేయర్' అనిపించుకుంటున్నాడు. అమర్ దీప్ కి ఒకే ఒక గేమ్ ఆడే ఛాన్స్ వచ్చింది అందులో ఫెయిల్ అయ్యాడు. ఇక అశ్వగంధ (గౌతమ్ కృష్ణ) చెత్త కారణాలు చెప్తూ శివాజీని టార్గెట్ చేయడమే పనిపెట్టుకొని మరింత నెగెటివిటి సంపాదించుకుంటున్నాడు. అంబటి అర్జున్ కన్నింగ్ గేమ్ ఇప్పటికే అందరికి ప్రేక్షకులకు అర్థం అయింది‌. దీంతో హౌస్ లో ఎలిమినేషన్ లో శోభాశెట్టి, గౌతమ్, అంబటి అర్జున్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఒకవేళ బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తే గౌతమ్, అర్జున్ లలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేషన్ అవుతారు.

ప్రియాంక జైన్ ఆట ఆడకపోయిన ఓట్లు అధికంగానే పడుతున్నాయి. అయితే అంబటి అర్జున్- గౌతమ్ కృష్ణలకి చాలా తక్కువ ఓటింగ్ నమోదవుతుంది. అసలు రెండు వారాలకే బయటకొస్తుందనకున్న అశ్వినిశ్రీ నాల్గవ స్థానంలో ఉంది. రతిక కూడా సేవ్ జోన్ లో ఉంది. ఎందుకంటే రతిక గేమ్ ఆడకపోయిన కంటెంట్ క్రియేట్ చేయడం కోసం గట్టిగానే మాట్లాడుతుంది.

ఇటు అశ్వినిశ్రీతో గుసగుసలు, అటు అంబటి అర్జున్ తో చెప్పుడు మాటలు చెప్తూ రతిక ఎంతో కొంత కంటెంట్ కోసంకష్టపడుతుంది. అయితే శోభాశెట్టి తన స్నేహితురాలైన ప్రియాంకకి పట్టం కట్టడానికి ఏకంగా శివాజీతోనే గొడవకి దిగింది. అయితే ఈ వారం నమోదైన ఓటింగ్ లో శోభాశెట్టి, గౌతమ్ కృష్ణ, అంబటి అర్జున్ డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఈ వారమైన కచ్చితంగా శోభాశెట్టిని ఎలిమినేషన్ చేయాలని బిగ్ బాస్ అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.