English | Telugu
Yawar : ఎవిక్షన్ ఫ్రీ పాస్ రేసులో యావర్ ముందంజ!
Updated : Nov 17, 2023
బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. నిన్న మొన్నటి దాకా ఫ్యామిలీ వీక్ సాగింది. ఇక ఈ వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్.
ఏదీ ఊరికే రాదు. అది చిన్న పాసైన పెద్ద గోల్డ్ మెడల్ అయినా.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అదే జరుగుతుంది. కంటెస్టెంట్స్ మధ్య చిత్ర విచిత్రమైన టాస్క్ లు పెడుతూ కంటెస్టెంట్స్ తో ఒక ఆట ఆడుకుంటున్నాడు బిగ్ బాస్. మొదట హౌస్ లో బాటమ్-5 కి మధ్య పోటీ పెట్టగా అంబటి అర్జున్ గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని గెలుచుకున్నాడు. ఇక ఈ పాస్ ని కాపాడుకోవడానికి టాప్-5 లోని కంటెస్టెంట్స్ తో డిఫెండ్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక టాప్-5 లోని ఎవరితో ఆడతావని అర్జున్ ని అడుగగా యావర్ తో అని చెప్పాడు. వీరిద్దరి మధ్య ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అదేంటంటే.. బాల్స్ ని స్టాండ్ మీద పెట్టి వాటిని పడకుండా బ్యాలెన్స్ చేయాలనే టాస్క్ ని ఇచ్చాడు. దీనిలో యావర్ గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని గెలుచుకున్నాడు.
యావర్ ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని కాపాడుకోవడానికి టాప్-5 లోని మిగిలిన నలుగురితో పోటీ పడాల్సి వస్తుందని బిగ్ బాస్ చెప్పాడు. ఇక తర్వాతి ఇచ్చిన టాస్క్ ' స్కూటర్ పై సవారి విజయానికి దారి'. ఈ టాస్క్ లో పల్లవి ప్రశాంత్ యావర్ మధ్య పోటీ జరుగగా యావర్ గెలిచాడు. ఆ తర్వాత శోభాశెట్టి, యావర్ కి మధ్య ' ఐ లవ్ బర్గర్' అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో ఒక డైస్ ని ఇచ్చి దానిని నేల మీద విసిరేస్తే బర్గర్ సింబల్ వస్తే వెళ్ళి బర్గర్ తినాలని అలా అన్ని బర్గర్ లు తిన్నాక బెల్ కొట్టాలని బిగ్ బాస్ చెప్పగా.. యావర్ ఈ టాస్క్ లో గెలిచాడు.