English | Telugu
ఆదిరెడ్డి న్యూ సెలూన్ ..రిబ్బన్ కట్ చేసిన రాహుల్ సిప్లిగంజ్
Updated : Dec 11, 2023
బిగ్ బాస్ రివ్యూ వీడియోస్ తో పేరు తెచ్చుకున్న ఆదిరెడ్డి గురించి అందరికీ తెలుసు. కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ లోకి పిలుపు రావడంతో ఒక్కసారిగా అతని లైఫ్ చేంజ్ ఐపోయింది. బిగ్ బాస్ సీజన్ 6 తో స్టార్ ఐపోయాడు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక పలు టీవీ షోలలో పాల్గొన్నాడు. రీసెంట్ గా ఆదిరెడ్డి విజయవాడలోని కాస్ట్లీ ఏరియా ఐన లోటస్ ల్యాండ్ మార్క్ లో ప్రముఖ సెలూన్ కంపెనీ జావేద్ హబీబ్ బ్రాంచ్ ని స్టార్ట్ చేసాడు. ఈ సెలూన్ ని సింగర్, బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో రిబ్బన్ కటింగ్ చేయించాడు.
ఈ ఫొటోస్ ని, వీడియోస్ ని ఆదిరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి అవి వైరల్ అయ్యాయి. "మా కోసం విజయవాడ వచ్చి సెలూన్ ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్ రాహుల్ సిప్లిగంజ్ అన్న. నా లైఫ్ లో ఇది మొదటి బిజినెస్. దీని వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రస్తుతం 15 మందికి వర్క్ ఇస్తున్నాము, దానికి చాలా సంతోషంగా ఉంది" అంటూ తన స్టయిల్లో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి వైఫ్ కవిత వాళ్ళ ఫామిలీ మెంబర్స్ అంత పాల్గొన్నారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆదిరెడ్డికి కంగ్రాట్స్ తెలుపుతున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పని చేసిన ఆదిరెడ్డి బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నుంచి యూట్యూబ్‌లో రివ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. మొదట ఏమంత ఫాలోయింగ్ లేకపోయినా ఆ తర్వాత మాత్రం ఆదిరెడ్డి రివ్యూస్ కి అతని ఛానల్ కి మంచి ఫాల్లోవింగ్ వచ్చి పాపులర్ అయ్యారు. అలాగే ఆదిరెడ్డి భార్య ‘కవిత నాగ వ్లాగ్స్’ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. ఆది రెడ్డికి ఓ చెల్లి కూడా ఉన్నారు. ఆమె పేరు నాగలక్ష్మి.. ఆమెకు కళ్ళు కనిపించవు.. ఇక ఈమె ఆదిరెడ్డి ఫామిలీతోనే కలిసి ఉంటుంది.