English | Telugu
బిగ్ బాస్ చరిత్రలో శివాజీ రికార్డు.. ఓటింగ్ లో ఎదురులేని మనిషి!
Updated : Dec 7, 2023
బిగ్ బాస్ అన్నీ సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ ఎంతో ప్రత్యేకం అదేంటంటే ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన రైతిబిడ్డ ఫైనల్ వీక్ వరకు ఉండడం, మరోవైపు నలభై ఏళ్ళ పైబడి ఉన్న ఏ కంటెస్టెంట్ చివరి వరకు ఉండకపోవడమే కారణం.
ఇప్పటివరకు సీజన్-7 లో జరిగిన నామినేషన్ లో శివాజీ ఉంటే అతనే టాప్.. అతన్ని కొట్టేవాడే లేడన్నది నిజం. ఆ తర్వాత స్థానంలో ఒక్క పల్లవి ప్రశాంత్ కి మాత్రమే ఆ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉంది. ఇక మన అమరదీపం ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా తన పిచ్చి చేష్టలతో పోగొట్టుకుంటున్నాడు. ఇది అమర్‌దీప్ కి మరింత నష్టాన్ని కలిగిస్తుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉండటమంటే టాస్క్ లో ఫెయిర్ గా ఉండి, తమ వందకి వంద శాతం ఇస్తూ పోరాడాలి. కానీ అలా కాకుండా ప్రతీ టాస్క్ లో ఇతర హౌస్ మేట్స్ పై ఆధారపడి వాళ్ళ సహాయంతో గెలిస్తే అది గెలిచినట్టు కాదని అందరికి తెలుసు. శివాజీకి పడే ఓటింగ్, అమర్ దీప్ కి పడే ఓటింగ్ ని ఒకసారి సీరియల్ బ్యాచ్ కి చూపిస్తే వాళ్ళు ఎంత నెగెటివిటితో హౌస్ లో ఉన్నారో అర్థం అవుతుంది.
హౌస్ లో ఇప్పటివరకు ఎంత మంది కెప్టెన్ లు అయిన శివాజీ కెప్టెన్ కోసం ఎంతోమంది ఎదురు చూసారంట అతనెంత ప్రత్యేకమో అర్థమవుతుంది. శివాజీ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో ఓటింగ్ పడేది పల్లవి ప్రశాంత్ కే దక్కుతుంది. సీజన్ 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాడు. వెళ్లడమే కాదు.. అనూహ్య రీతిలో ఆట ఆడి.. బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత టాస్క్ లలో ఆడి హౌస్ మేట్ అయ్యాడు. ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు.. 14 వారాల పాటు తన ఆటకి సాటే లేదు అన్నట్టుగా రైతు బిడ్డ చెమటచిందించి సెలబ్రిటీ కంటెస్టెంట్స్‌కి చెమటలు పట్టించాడు. ఓటింగ్ లో శివాజీ, ప్రశాంత్ లని బీట్ చేసే కంటెస్టెంట్ ఎవరు లేరనేది అందరికి తెలిసిన నిజం. ఈ ఇద్దరి లోనే ఎవరికో ఒకరికి టైటిల్ ప్రైజ్ దక్కుతుందనేది ఇప్పటికే కన్ఫమ్ అయింది.