English | Telugu

గుప్పెడంత మనసు జ్యోతిరాయ్ పెళ్ళి.. ఇదేం ట్విస్ట్!

నిన్న మొన్నటి దాకా గుప్పెడంత మనసు జగతి అలియాస్ జ్యోతిరాయ్ ఒక డైరెక్టర్ తో లివింగ్ రిలేషన్ లో ఉందని అనుకున్నారంతా కానీ ఇప్పుడు ఏకంగా పెళ్ళి జరిగిందని తనే ఇమ్ స్టాగ్రామ్ లో ఒక అభిమానితో‌ షేర్ చేసుకుంది‌. కన్నడ పరిశ్రమ నుంచి జ్యోతిరాయ్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దాదాపు 20కిపై సీరియల్స్‌లో నటించిన జ్యోతిరాయ్‌.. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతిగా తల్లి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

నిన్నటివరకు ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకోబోతోందన్న వార్త వైరల్‌గా మారగా ఈరోజు ఏకంగా పెళ్ళి జరిగిందని చెప్పింది. తన 20 ఏళ్ళ వయసులోనే పద్మనాభం అనే వ్యక్తిని పెళ్ళి చేసుకున్న 38 సంవత్సరాల జ్యోతి రాయ్‌ అతనితో కొన్నాళ్ళు కాపురం చేసింది. వారికి ఒక బాబు. కారణాలు తెలియవు కానీ అతనికి ఇప్పుడు దూరంగా ఉంటోంది జ్యోతి. అయితే గత కొంతకాలంగా యంగ్‌ డైరెక్టర్‌ సుకు పుర్వాజ్‌ను జ్యోతి పెళ్ళి చేసుకోబోతోందని రూమర్లు వచ్చాయి. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని వారు పోస్ట్‌ చేస్తున్న ఫోటోల ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు ఆ రూమర్స్‌ అన్నీ నిజమేనని తెలిసింది.

తాజాగా తను ఇన్ స్టాగ్రామ్ లో " ఆస్క్ మీ క్వశ్చన్" ని స్టార్ట్ చేసింది. కన్నడలో సినిమాలు చేశారా అని ఒక అభిమాని అడుగగా.. హా చేశాను నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతాయని జ్యోతి అంది. టాలీవుడ్ లో నటిస్తున్నారా అని మరొకరు అడుగగా.. హా చేసాను కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయని అంది. తమళ భాషలో నటిస్తున్నారా అని ఒకరు అడుగగా.. లేదు మూవీ స్క్రిప్ట్స్ చూస్తున్నా అని అంది. అయితే ఒకతను మీరు మ్యారీడ్ ఆ అని అడుగగా.. ఎస్ అని సమాధానమిచ్చింది జ్యోతి. కాగా ఇప్పుడు బహిరంగంగా తనకి పెళ్ళి అయినట్టు ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. నిన్న తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది. పోలీస్ డ్రెస్ లో తళుక్కుమన్న జగతి.. అండర్ వరల్డ్ బిలియనీర్స్ అనే ఒక వెబ్ సిరీస్ లోని గెటప్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.