English | Telugu

శివాజీకి నామినేషన్ లో భారీ మెజారిటీ ఖాయం.. ఇదే సాక్ష్యం!


బిగ్ బాస్ సీజన్-7 లో శివాజీ అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరికి తెలిసిందే. నామినేషన్ లో శివాజీ ఉంటే చాలు అత్యధిక ఓటింగ్ శాతం నమోదవుతుంది. మిగిలిన హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరికి కలిపి 30 శాతం ఓటింగ్ వస్తే శివాజీకి ఒక్కడికే 70 శాతం ఓటింగ్ నమోదవుతుంది.

మొన్నటి ఫ్యామిలీ వీక్ లో‌ వచ్చిన ప్రతీ ఒక్కరు శివాజీని టాప్-3 లో ఉంచడంతో ఈ సీజన్ టైటిల్ శివాజీదే అని అందరు ఫిక్స్ అయ్యారు. అయితే హౌస్ మొత్తంలో ఫెయిర్ గేమ్ ఆడుతూ, ఎవరి మీద కన్నింగ్ ప్లాన్ వేయకుండా ఆడేది శివాజీ, యావర్, ప్రశాంత్ మాత్రమే.. అందుకే వీళ్ళు ముగ్గురు నామినేషన్ లో ఉంటే చాలు వీరే టాప్-3 లో ఉంటున్నారు. ఇక సీరియల్ బ్యాచ్ చేసే స్ట్రాటజీలని యావర్, ప్రశాంత్ లకి అర్థమయ్యేలా చెప్తూ వారిని సరైన విధంగా మాట్లాడేలా చేస్తూ మంచి సపోర్టింగ్ ఇస్తున్నాడు శివాజీ. ఓ బేబీ టాస్క్ లో గాయాలవుతున్న పదకొండు మందికి పోటీగా ఆడి గెలచి కెప్టెన్సీ రేస్ లో నిలిచాడు శివాజీ‌. దీంతో శివాజీ గ్రాఫ్ మరింత పెరిగింది.

నిన్న యావర్ ని అమర్ దీప్, అంబటి అర్జున్ నామినేట్ చేసాక.. నేను కావాలని చేయలేదంటూ యావర్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. సిగరెట్ తాగుతూ ఒంటరిగా కూర్చున్నాడు యావర్. అప్పుడే శివాజీ అక్కడికి వచ్చి.. నీకు పదవ వారమే చెప్పాను. ఈ ఐదు వారాలు చాలా ముఖ్యమని, కోప్పపడకని శివాజీ అన్నాడు. నాకు తెలియకుండా జరిగిందానికి నామినేట్ చేయడమేంటి అన్న.. నేను వెళ్లిపోతా అన్నా అంటూ యావర్ ఏడ్చేశాడు. అది రాంగ్ మీ అన్నకి మాటిచ్చినవ్.. నా బిడ్డల మీద ఒట్టు. నేను ఇక్కడ ఫోర్స్‌గా ఉన్నాను. మీరు హ్యాండిల్ చేయలేరనే ఉన్నాను ఎందుకు ఏడుస్తున్నావ్‌ రా? చేతకాదా ఆడటం.. లైఫ్‌లో మళ్లీ ఇలాంటి సిచువేషన్ రాదు.

నేను ఇలా చేసుకున్నా తెలియని వయసులో కోపంతో.. అంటూ శివాజీ మంచి సపోర్టివ్ గా మాట్లాడాడు. ఆ తర్వాత.. " అమర్ అలా ఎలా నామినేట్ చేస్తాడన్నా.. సంచాలక్ వాడే కదా.. తప్పు వాడిది కదా" అని యావర్ చెప్పగా.. ఆడియన్స్‌ చూస్తారు కదరా అని శివాజీ అన్నాడు. ఒకవైపు హౌస్ లోని కంటెస్టెంట్స్ కి అండగా ఉంటూ, మరొకవైపు టాస్క్ లలో తన ఆటతీరుతో అదరగొడుతున్న శివాజీకి భారీ మెజారిటీ ఖాయమని తెలుస్తుంది. అయితే అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ ఇద్దరు కన్నింగ్ గా ఆలోచిస్తూ.. శివాజీ, ప్రశాంత్, యావర్ లని అన్ ఫెయిర్ నామినేషన్ చేయడంతో కావాలని టార్గెట్ చేస్తున్నారనేది అందరికి స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇలాంటి కన్నింగ్ స్ట్రాటజీలు ప్లే చేస్తూ ఫెయిర్ గేమ్ ఆడే కంటెస్టెంట్స్ ని టార్గెట్ చేసిన అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ ఈ వారం ఎలిమినేట్ అవుతారా లేదా చూడాలి మరి.