English | Telugu

శివాజీకే అత్యధిక మద్దతు.. అర్జున్ కి డిపాజిట్ గల్లంతు!

ఇదేందయ్య ఇది బిగ్ బాస్ హౌస్ లో శివాజీకి యునానిమస్ గా ఓటింగ్ జరిగింది. హౌస్ లో ఏడుగురు ఉండగా.. అందులో అర్జున్, శివాజీ టాస్క్ లలో గెలిచి ఓట్ అప్పీల్ కోసం నిల్చునున్నారు. ఇక అందరు శివాజీకే మద్దతు ఇచ్చారు.

నిన్నటి ఎపిసోడ్ లో ఓట్ అప్పీల్ కోసం ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్‌. హౌస్ మేట్స్ అంతా బర్త్ డే క్యాప్ లు పెట్టుకొని పైన ఉన్న బెలూన్స్ ని కొట్టాలని, అందులో నుండి క్యాండీలు చాక్లెట్లు పడతాయని వీలైనన్ని ఎక్కువగా సేకరించాలని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ కి సంఛాలక్ గా అర్జున్ ఉంటాడని చెప్పగా అతను కొన్ని రూల్స్ చెప్పాడు. క్యాండీలు వద్దు, చాక్లెట్లు తీసుకోండి అని అన్నాడు. దాంతో పల్లవి ప్రశాంత్ చాక్లెట్ల మీద ఫోకస్ పెట్టాడు. అయితే ఈ గేమ్ తర్వాత ఎవరైతే ఎక్కువ క్యాండీలు సేకరిస్తారో వారే విజేత అని బిగ్ బాస్ చెప్పాడు. పల్లవి ప్రశాంత్ ఒక్కటంటే ఒక్కటే క్యాండీ కలెక్ట్ చేసాడు. దాంతో సంఛాలక్ గా ఉన్న అర్జున్ తో‌‌.. " అన్న నువ్వే కదా క్యాండీ వద్దు చాక్లెట్లు తీసుకోండి" అని అన్నావని ప్రశాంత్ అనగా.‌. ఇప్పుడేమైందిరా అంటు కన్నింగ్ డ్రామాలు ఆడాడు అర్జున్. ఇక సంఛాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్.. గేమ్ అయిపోయిందిగా వదిలేయ్ అని ప్రశాంత్ తో శివాజీ అన్నాడు. ఇక ఈ టాస్క్ లో శివాజీకి 15 క్యాండీలు, అమర్ కి 14, ప్రియాంక 12, శోభాకి 4, ప్రశాంత్ 1 క్యాండీ కలెక్ట్ చేయడంతో .. అత్యధిక క్యాండీలు సేకరించిన శివాజీ విజేతగా నిలిచాడు. దాంతో ఓట్ అప్పీల్ కోసం శివాజీ అర్హత సాధించాడు. ఇక అంతకముందు టాస్క్ లో అర్జున్ గెలిచి మరోసారీ ఓట్ అప్పీల్ కోసం అర్హత సాధించిన విషయం తెలిసిందే.

ఓట్ అప్పీల్ కోసం శివాజీ ఒకవైపు, అర్జున్ ఒకవైపు నిల్చోగా హౌస్ మేట్స్ తమ మద్దతుని ఇవ్వడం మొదలెట్టారు. నా ఓట్ శివాజీకే అన్న. నువ్వు ఆల్రెడీ ఓట్ అప్పీల్ చేసుకున్నావ్ కదా అన్న అని అర్జున్ తో ప్రశాంత్ చెప్పి తన మద్దతు శివాజీకి తెలిపాడు. ఇక ఆ తర్వాత అమర్ దీప్ కుడా అదే రీజన్ చెప్పి శివాజీకి సపోర్ట్ చేశాడు. ఇక యావర్ టర్న్ వచ్చేసరికి.. రేయ్ ఒక్కటంటే ఒక్కటైన నాకు ఓట్ చేయండి రా.. కనీసం ఒక్కరైన మద్దతు చేయకపోతే ఎలా రా అంటు అర్జున్ కామెడీ చేశాడు. హౌస్ మేట్స్ అంతా ఫుల్ నువ్వుకున్నారు. ఇక శోభాశెట్టి కూడా శివాజీకి మద్దతు ఇచ్చింది. ఇలా నాలుగు ఓట్లు శివాజీకే పడడంతో.. రేయ్ ఎంట్రా ఇది అని అర్జున్ అనడంతో హౌస్ అంతా ఒకటే నవ్వు.. ప్రియాంక మీ మద్దతు ఎవరికిస్తున్నారో చెప్పండి అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. తను కూడా శివాజీకే సపోర్ట్ చేయడంతో అర్జున్ మొహం చూడాలి. రేయ్ సపోర్ట్ చేయాలి కానీ మరీ 5-0 తోనా.. డిపాజిట్ కూడా రాలేదు కదరా ఎంట్రా ఇది అని అర్జున్ తన బాధను నవ్వుతూ చెప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత శివాజీ తన ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. " బయట ఎలా ఉన్నానో హౌస్ లో అలానే ఉన్నాను. ఫెయిర్ గా ఆడుతున్నాను. నా గేమ్ నేను ఆడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ టు మి" అంటూ శివాజీ తన ఓట్ అప్పీల్ చేసుకున్నాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.