English | Telugu
డియర్ సూపర్ సింగర్...అంటున్న సింగర్స్...త్వరలో కొత్త సింగింగ్ షో
Updated : Dec 8, 2023
స్టార్ మాలో త్వరలో "సూపర్ సింగర్" షో కొత్తగా లాంచ్ కాబోతోంది. దీనికి సంబందించిన ఆడిషన్స్ పూర్తయ్యాయి...ఇక ఈ షో షూటింగ్ కూడా జరుపుకుంటోంది. లేటెస్ట్ గా ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. "డియర్ సూపర్ సింగర్..నీకు నేను ఎలా కనిపిస్తున్నాను. నీ కాగితం మీదున్న అక్షరం లాగానా...ఆ అక్షరాలను దండగా గుచ్చిన వాక్యం లాగానా...నేను పువ్వునో, దండనో, దారాన్నో కాదు...వాటి వెనకున్న గంధాన్ని...అంటే భావాన్ని. నీ పాట వినే చెవిని..నీకు బాట చూపే రవిని...నీ కార్యానికి కారణమైన కవిని. తానూ..నేను పాటలో ఆ నేను నేనే ఐతే..ఆ తాను మరెవరో కాదు..అది నువ్వే..ఈ నిజం చాటడానికి..నీ భుజం తట్టడానికి వస్తున్నా..నేనొస్తున్నా." అంటూ అనంత శ్రీరామ్ చెప్పిన కవితతో ఈ ప్రోమోని విడుదల చేశారు.
ఇక ఇప్పుడు ఈ షో షూటింగ్ కూడా జరుగుతోంది..ఈ సింగింగ్ కాంపిటీషన్ కి జడ్జెస్ గా రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, అనంత శ్రీరామ్, శ్వేతా మోహన్ వ్యవహరిస్తున్నట్లు రాహుల్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్న ఒక పిక్ ద్వారా తెలుస్తోంది. స్టార్ మాలో సూపర్ సింగర్ తో పాటు సూపర్ సింగర్ జూనియర్ షోస్ ఇప్పటివరకు ఆకట్టుకున్నాయి. తాజాగా మరోసారి సీనియర్ కేటగిరీలో ఈ సింగింగ్ కాంపిటీషన్ జరగబోతోంది. స్టార్ మాలో సీరియల్స్ క్యూ లో ఉన్నాయి. అలాగే ఇలాంటి షోస్ కూడా వరుస కడుతున్నాయి. కూల్ వెదర్ లో హాట్ హాట్ షోస్ ని అందిస్తోంది స్టార్ మా. ఇక ఈ సింగింగ్ షో కూడా త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది.