English | Telugu
బిగ్ బాస్ హౌస్‌లో శోభా శెట్టిని గన్‌తో కాల్చిన గౌతమ్!
Updated : Nov 24, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో పదకొండు వారాలు పూర్తిచేసుకొని పన్నెండవ వారం ముగింపుకి వచ్చింది. ఇక గ్రాంఢ్ ఫినాలేకి కొన్ని వారాలే ఉండటంతో ఈ వారం చివరి కెప్టెన్ ఎవరా అని ఆసక్తి అందరిలో నెలకొంది.
తాజాగా విడుదలైన ప్రోమోలో.. పన్నెండవ వారం హౌస్ లో కొత్త కెప్టెన్సీ కోసం " మెషిన్ గన్ టాస్క్ " ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో గన్ షూటింగ్ సౌండ్ వచ్చిన ప్రతీసారీ రెండు ఫోటోలు ఎదురుగా ఉంటాయి. ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి ఏకాభిప్రాయంతో ఒకరిని సెలెక్ట్ చేసుకొని మరొకరిని తీసేయాలని బిగ్ బాస్ చెప్పాడు. శోభాశెట్టి, అంబటి అర్జున్ ఇద్దరి ఫోటోలు రాగా గౌతమ్ కృష్ణ తన సపోర్ట్ ని అంబటి అర్జున్ కి ఇచ్చాడు. గౌతమ్ తో కంపేర్ చేస్తే శోభాశెట్టి అన్ ఫెయిర్ గేమ్ ఆడుతుందని అనిపిస్తుందని అందుకే తీసేస్తున్నట్టుగా గౌతమ్ కృష్ణ అన్నాడు. అలా అనగానే శోభాశెట్టి అందుకుంది. నేనెక్కడ ఫౌల్ చేశాను, ఎక్కడ అన్ ఫెయిర్ గేమ్ ఆడానంటూ రెచ్చిపోతూ కన్పించింది. ఇక గౌతమ్, ప్రియాంక కలిసి ఏకాభిప్రాయంతో శోభాశెట్టిని కెప్టెన్సీ రేస్ నుండి తప్పించినట్టు తెలుస్తుంది. ఇక ప్రియంక మరియు శోభాశెట్టి మధ్య గ్యాప్ పెరిగే అవకాశం ఉంది. ఇక మరోసారి గన్ షూటింగ్ లో .. శివాజీ, ప్రశాంత్ ల ఫోటోలు రావడంతో అటు యావర్ కాల్చే వ్యక్తిగా ఉన్నాడు. నా ఫోటో కాల్చొద్దని నేనంటున్నా అని ప్రశాంత్ అనగా.. శివాజీ అన్న ఫోటో కాల్చాలా అని యావర్ అన్నాడు. ఇక ఇందులో ప్రశాంత్ ఫోటో కాలిపోతుందని తెలుస్తుంది.
అమర్ దీప్, అశ్వినిశ్రీ ఇద్దరి ఫోటోలు ఉండగా.. కాల్చడానికి శోభాశెట్టి, ప్రశాంత్ ఉన్నారు. ఇక ఇద్దరు కలిసి అశ్వినిశ్రీని తప్పించినట్టు తెలుస్తుంది. నా సపోర్ట్ ఎప్పుడు అమర్ దీప్ కి, అపోజిట్ గా ఎవరున్నా తీసేస్తానని శోభాశెట్టి గర్వంగా చెప్పింది. ఇక ప్రశాంత్ తన సపోర్ట్ అమర్ కే అని చెప్పగా.. నన్ను ఈ కెప్టెన్సీ రేస్ నుండి ఎవరు తీసేసిన ఒప్పుకుంటాను కానీ నువ్వు తీసేసావ్ చూడు అది నేను తీసుకోలేకపోతున్నాని అశ్వినిశ్రీ అంది. ఇక ఇదే చిట్ట చివరి కెప్టెన్సీ టాస్క్ కాబట్టి ఎవరు కెప్టెన్ అవుతారనే ఆసక్తి అందరిలో ఉంది.