English | Telugu

సంఛాలక్ గా శోభాశెట్టి ఫెయిల్.. నిలదీసిన శివాజీ!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఉత్కంఠభరితంగా సాగుతుంది. సీజన్-7 చివరి దశకి రావడంతో కంటెస్టెంట్స్ మధ్య ఆర్గుమెంట్స్ బీభత్సంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం హౌస్ లో ఓటు అప్పీల్ కోసం టాస్క్ లు‌ ఇస్తూ కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపిస్తున్నాడు‌ బిగ్ బాస్. హౌస్ లో ఉన్న వారిలో మోస్ట్ అన్ డిజర్వింగ్ కంటెస్టెంట్ ఎవరైన ఉన్నారంటే అది శోభాశెట్టి అని అందరికి తెలుసు. తను ఎలిమినేట్ అయితే చూడటానికి జనాలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

ఇక తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో సంఛాలక్ గా శోభాశెట్టిని పెట్టాడు బిగ్ బాస్. బిగ్ బాస్‌కి తన దత్త పుత్రికపై ఎంత అభిమానమో.. ఎంత ప్రేమ, ఎంతగా సపోర్ట్ చేస్తున్నారో చెప్పడానికి ఇదొక్కటి చాలు. ఆడియన్స్‌తో ఓట్లు వేయించుకుని, వాళ్ళని పిచ్చొళ్ళని చేస్తూ శోభాశెట్టిని సేవ్ చేస్తూ వస్తున్నాడు బిగ్ బాస్. చివరి వారాల్లో కూడా తన సీరియల్ బ్యాచ్‌ని సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇన్ని సీజన్లు జరిగాయి కానీ.. పబ్లిక్‌గా ఇంత ఏకపక్షంగా సపోర్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ ఏదైనా ఉందంటే అది సీజన్ 7 మాత్రమే. కనీసం చివరి వారాల్లో అయిన శోభాశెట్టి దత్త పద్దతి మార్చుకుంటుందా అంటే అదీ లేదు. మరింతగా రెచ్చిపోతు ప్రేక్షకులకి చిరాకు తెప్పిస్తుంది.

ఈ సారి శివాజీని టార్గెట్ చేస్తూ శోభాశెట్టి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. దీంతో శివాజీ.. ఈ ఆట నేను ఆడను.. ఆమె సంచాలక్‌గా ఉండి.. మాటి మాటికీ ప్రియాంక ప్రియాంక అంటే.. ఏం పీకడానికి మేం ఉన్నది అంటూ బాల్స్‌ని విసిరికొట్టి గేమ్ నుంచి తప్పుకున్నాడు శివాజీ. దీంతో శోభాశెట్టి.. ‘అది నా ఇష్టం.. నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తా’ అని అన్నది. సంచాలక్‌గా ఉండి సపోర్ట్ చేయొచ్చా? అని శివాజీ అడిగితే.. ‘సంఛాలక్ అయిన శోభా అయిన నా ఇష్టం.. నేను ఎవరికైన సపోర్ట్ చేస్తా.. నేనేం బాల్స్ తెచ్చి ప్రియాంకకి ఇచ్చి కొట్టమనలేదు కదా.. ప్రియాంకకి సపోర్ట్ చేయాలని ఉంది చేశాను’ అని శోభాశెట్టి అంది. ఒక సంఛాలక్ అయి ఉండి టాస్క్ లో ప్లేయర్స్ తప్పు చేస్తే చెప్పేది పోయి వారికి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ . దీనిపై వీకెండ్ లో శోభాశెట్టికి నాగార్జున గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఎందుకంటే ఇప్పటికే శోభాశెట్టి సంఛాలక్ గా ఉండి చాలా టాస్క్ లని ప్రియాంక, అమర్ దీప్ లకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు జెన్యున్ గా ఆడే ప్లేయర్స్ కి అడ్డుకట్టలా నిల్చొని ఆ ఇద్దరికే సపోర్ట్ చేసిన శోభాశెట్టి మరింత నెగెటివిటి మూట గట్టుకుంటుంది.