English | Telugu

శోభాశెట్టి ఎలిమినేటెడ్.. తన జర్నీ వీడియో కూడా రెడీ చేసారంట!

బిగ్ బాస్ సీజన్-7 లో ఒక్కో కంటెస్టెంట్స్ ఒక్కో‌ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. ఉల్టా పుల్టాతో హౌస్ లో ప్రతీవారం ఒక్కో ట్విస్ట్ ఇస్తున్నాడు బిగ్ బాస్. ప్రస్తుతం ఓట్ అప్పీల్ కోసం హౌస్ మేట్స్ కి భిన్నమైన టాస్కు లు ఇస్తున్నాడు ‌బిగ్ బాస్. దీంతో స్పై బ్యాచ్, స్పా బ్యాచ్ మధ్య వార్ సాగుతుంది.

ఇక శోభాశెట్టిని ఎలిమినేట్ చేయాలంటూ గత కొన్నివారాలుగా ఆడియన్స్ తనకి అసలు ఓట్లే వేయకుండా లీస్ట్ లో ఉంచినా బిగ్ బాస్ సేవ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక శోభాశెట్టి ఎలిమినేషన్ కోసం ఎదురుచూసి, చూసీ జనానికి చిరాకు వచ్చేసింది. ఎంత చిరాకు వచ్చిందంటే.. ఫినాలే వీక్‌లో మొత్తానికి ఓట్లు వేయడమే మానేస్తున్నారు. శోభాశెట్టి వరుస సేవింగ్‌లతో ఎలిమినేషన్, ఓటింగ్‌లపై జనానికి నమ్మకం పోయింది. మనం ఓట్లేసిన బిగ్ బాస్ వాటిని లెక్కలోకి తీసుకోడుగా, అలాంటప్పుడు ఓట్లేసి ప్రయోజనం ఏముందని ఫినాలే వీక్‌లో ఓట్లు వేయడానికి జనం ఇష్టపడటం లేదు. ప్రతి సీజన్‌లో అయితే.. పోటీ పడి ఓట్లు గుద్దేవారు చివరి వారాల్లో కానీ శోభాదెబ్బకి ఓట్లు వేయడానికి బిగ్ బాస్ రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులు ఇష్టపడటం లేదు.

ఇక శోభాశెట్టి ఎలిమినేటెడ్ అనే వార్త వినడం కోసం జనాలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు. ఎంతలా అంటే బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అయితే చాలు.. శోభాశెట్టి ఎలిమినేట్ అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఒక సీజన్‌లో ఇంత నెగెటివిటి ఉన్న కంటెస్టెంట్ ని ఇన్నివారాలు ఉంచడం ఇదే తొలిసారి. మరి బిగ్ బాస్ మామ తన దత్తపుత్రిక ఈ వారం పంపిస్తాడా లేక మరోసారీ జనాల ఓటింగ్ ని పక్కన పెడతాడా చూడాలి. అయితే తాజాగా సోషల్ మీడియాలో లీక్ అవుతున్న సమాచారం ప్రకార శోభాశెట్టి, ప్రియాంక జైన్ ల జర్నీ వీడియోలని కూడా రెడీ చేసారని వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.


Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.