English | Telugu
చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది అంటూ ఎమోషన్
Updated : Oct 17, 2023
సుమ అడ్డా లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి "కృష్ణారామ" మూవీ టీమ్ వచ్చారు..రచ్చ రవి, రాజ్ ముదిరాజ్, గౌతమీ, నట కిరీటి రాజేంద్రప్రసాద్ ఎంట్రీ ఇచ్చారు. ఇక రాజేంద్రప్రసాద్ రావడంతో ఈల వేసి గోల చేశారు. ఇక రచ్చ రవి రెచ్చిపోయి "రాజాధి రాజా..రాజా కిరీటి రాజేంద్రప్రసాద్ గారికి బహుపరాక్" అంటూ వెల్కమ్ చెప్పేసరికి.."అందరూ నేను నీకేదో డబ్బులు ఇచ్చి తెచ్చాననుకుంటారు" అని కామెడీ చేసేసరికి అందరూ నవ్వేశారు.
దసరా రాగానే మీ సెలెబ్రేషన్స్ ఎలా ఉండేవో మాతో షేర్ చేసుకోండి అంటూ రాజేంద్ర ప్రసాద్ ని అడిగింది సుమ. "నా చిన్నప్పుడే మా అమ్మ గారు చనిపోయారు. మూడు నెలలు ఆల్మోస్ట్ చనిపోయే స్టేజికి వెళ్ళినప్పుడు అమ్మను కనకదుర్గమ్మ గుడికి తీసుకెళ్లి ఒరేయ్ ఇక మీ ఇంటి దగ్గర ఉండదురా అమ్మ ఇక్కడే ఉంటుంది" అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు. దాంతో ప్రోమో కట్ చేసారు. ఇక ఇందులో రాజేంద్రప్రసాద్ రెండు గ్రూపులకు న్యాయం చేయడానికి వచ్చే ఒక స్కిట్ వేశారు.
ఒక గ్రూప్ లోని స్టూడెంట్ వచ్చి " సర్ వాడి గేదె రోజు మా ఇంటి ముందు పేడ వేస్తోంది" అని ఫిర్యాదు చేసేసరికి "అది గేదె సర్ అది డైపర్లు వేసుకుని తిరగదు" అని సుమ కౌంటర్ వేసింది. "గేదె అన్నప్పుడు కట్టేసుకోండి వదిలేయొద్దు" అని రచ్చ రవి ఉచిత సలహా ఇచ్చేసరికి సుమకి మండిపోయింది.."ఎం నిన్ను వదిలేయలేదూ" అనేసరికి రవి ఫేస్ మాడిపోయింది. దానికి రాజేంద్రప్రసాద్ "ఆర్డర్..ఆర్డర్" అన్నాడు. "ఆ రెండు దోశలు" అని రవి ఫన్ చేసేసరికి రాజేంద్రప్రసాద్ కి కోపం వచ్చేసింది. ఇక ఈ ఎపిసోడ్ అక్టోబర్ 21 న ప్రసారం కాబోతోంది.