English | Telugu

'దీప్తిని చూసి చాలా నేర్చుకున్నా'.. ఒప్పుకున్న ష‌న్ను!

సోషల్‌ మీడియాలో షణ్ముఖ్‌-దీప్తి రిలేషన్‌షిప్‌ గురించి, వాళ్ళ క్లోజ్‌నెస్ గురించి అందరికీ తెలుసు. యూట్యూబ్‌ క్రియేటర్స్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సెలబ్రిటీ హోదా దక్కించుకున్నారు. ఐతే షణ్ముఖ్‌ బిగ్‌ బాస్‌ హౌస్ లోకి వెళ్లి వచ్చాక వారి మధ్య రిలేషన్‌ బ్రేక్ అయ్యింది. ఇక ఆ టైంలో వాళ్లిద్దరూ కలిసి ఉండాలంటూ వారి ఫాన్స్ కామెంట్లు పెట్టడం తెలిసిన విషయమే.

ఇప్పుడు ఆ ఫాన్స్ ఏం కోరుకున్నారో ఇక్కడ అదే జరిగింది. ఒక ఈవెంట్‌లో వీళ్ళిద్దరూ కనిపించేసరికి వారి ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు వాళ్ళ వీడియోలు యూట్యూబ్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఒక యూట్యూబ్‌ నెట్‌వర్క్‌ వైజాగ్‌లో ఓపెన్ చేసిన బ్రాంచ్ కి యూట్యూబ్‌ క్రియేటర్లు, ఆ చాన‌ల్‌ సభ్యులతో కలిసి ఒక ఈవెంట్ చేశారు.

అక్కడ స్టేజ్‌పై షణ్ముఖ్‌ జశ్వంత్‌ మాట్లాడుతూ “నేనుఇక్కడి వరకు ఎలా వచ్చానో ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. కొత్తలో యూట్యూబ్‌ కవర్‌ సాంగ్స్‌ చేస్తూ గుర్తింపు సంపాదించుకున్నాను. కాపీ రైట్ ఇష్యూస్ వల్ల పెట్టిన వీడియోస్ అన్నీ పోయాయి. దాంతో చాలా బాధపడ్డాను. ఆ తర్వాత నేనూ- దీప్తి కలిసి వీడియోలు చేశాం. ఆ సమయంలో నేను దీప్తీని చూస్తూ ఉండేవాడిని. ఆమెకు వచ్చినన్ని నెగెటివ్‌ కామెంట్స్‌ ఎవరికీ వచ్చేవి కావు. కానీ, ఆ కామెంట్స్ ని చూసి ఆమె ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. నేను దీప్తిని చూసి చాలా నేర్చుకున్నాను. అలాగే అమ్మాయిలూ ఎప్పుడూ అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉండాలి.” అన్నాడు షన్ను. అత‌డు చాలా బాగా చెప్పాడ‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.