English | Telugu

ఫామిలీ సర్కస్ తో ఫుల్ ఎంటర్టైన్ చేసిన బుల్లి తెర స్టార్స్

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం స్పెషల్ గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ లేటెస్ట్ వీక్ ఎపిసోడ్ లో ఫామిలీ సర్కస్ అనే కాన్సెప్ట్ తో బుల్లితెర స్టార్స్ అంతా తమ పిల్లలతో స్టేజి మీదకు వచ్చి డాన్స్ పెర్ఫార్మెన్స్, స్కిట్స్ చేసి ఫుల్ ఖుష్ అయ్యారు. శిరీష తన కొడుకుతో కలిసి "చిన్ని తండ్రి నిను చూడగా" అనే సాంగ్ కి ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. తర్వాత తాగుబోతు రమేష్ తన కూతురుతో కలిసి "గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి" సాంగ్ కి డాన్స్ చేసాడు.

ఇక యాట నవీన తన ఇద్దరు కొడుకులతో కలిసి "నీవే నీవే" సాంగ్ కి కలిసి డాన్స్ చేశారు. ఇంకా ఆటో రాంప్రసాద్, నాటీ నరేష్, పంచ్ ప్రసాద్ ని పంచ్ డైలాగ్స్ చెప్పనివ్వకుండా పిల్లలంతా కలిసి స్టేజి మీద గోల గోల చేసేసారు. ఇంతలో రష్మీ వచ్చి "ఇంద్రజ గారు ఈ స్కిట్ ఎలా అనిపించింది" అని అడిగేసరికి శిరీష కొడుకు మధ్యలో వచ్చి రష్మీ దగ్గర బూర ఊదేసి వెళ్ళిపోయాడు. దాంతో ఇంద్రజ పడీ పడీ నవ్వేసింది. బిజీ బిజీగా ఉండే అమ్మానాన్నలు పిల్లలకు అన్నం పెట్టకుండా, సండే కూడా ఎంజాయిమెంట్ లేకుండా పనిలో ఎలా మునిగి తేలుతున్నారో అని చెప్తూ వేసిన స్కిట్ అందరినీ ఎమోషన్ కి గురి చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.