English | Telugu
ఎలిమినేట్ అయిన షకీల.. మోస్ట్ హార్ట్ టచింగ్ ఎపిసోడ్!
Updated : Sep 17, 2023
బిగ్ బాస్ సీజన్-7 ఎన్నో ట్విస్ట్ లు, మరెన్నో డ్రామాలతో రోజు రోజుకి క్రేజ్ సంపాదించుకుంటుంది. గత సీజన్ తో పోల్చితే ఈ సీజన్ మరింత హైప్ క్రియేట్ చేయడమే కాకుండా అదే రేంజ్ లో ఆకట్టుకుంటుంది. మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ కాగా ఈ వారం షకీల ఎలిమినేట్ అయింది. దాంతో కంటెస్టెంట్స్ అంతా ఎమోషనల్ అయ్యారు.
షకీలని ఇప్పటివరకు ప్రతీ ఒక్క కంటెస్టెంట్ అమ్మ అనే పిలిచారు కాబట్టి అంతలా కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ ఎపిసోడ్ లో అందరు ఎక్కువగా ఎమోషనల్ అయ్యారు. నామినేషన్లో మొదట రతిక, ఆ తర్వాత యావర్, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ ఇలా ఒక్కొక్కరిని సేవ్ చేయగా చివరకి టేస్టీ తేజ, షకీల మిగిలారు. కంటెస్టెంట్స్ అందరికి ఈ ఇద్దరు బాగా దగ్గరయ్యారని తెలసింది. పల్లవి ప్రశాంత్ వన్ మ్యాన్ షో గా సాగింది. ఆటకి ఆట, పాటకి పాట అంటూ ఇరగదీసాడు. డ్యాన్స్ చేయమంటే ప్రాణం పెట్టి చేశావంటూ పల్లవి ప్రశాంత్ పై నాగార్జున ప్రశంసలు కురిపించాడు.
ఒకవైపు సండే ఫండే గేమ్ అంటూ సరదగా ఆడి పాడిన కంటెస్టెంట్స్ కి కాస్త టెన్షన్ పెడుతూ ఎలిమినేషన్ చేపించాడు బిగ్ బాస్. ఇక సీక్రెట్ రూమ్ లోకి ఇద్దరిని పిలిచి, అందులో మాయా ద్వీపం నుండి ఒక ఫోటో వస్తుంది. ఎవరిదైతే వస్తుందో వాళ్ళు సేఫ్, రానివాళ్ళు ఎలిమినేటెడ్ నాగార్జున చెప్పగా.. టేస్టీ తేజ ఫోటో వచ్చింది. దాంతో షకీల ఎలిమినేటెడ్ అని నాగార్జున చెప్పాడు. ఇక అందరికి బై చెప్పేసి వచ్చేయమని నాగార్జున చెప్పగా.. అమర్ దీప్, టేస్టీ తేజ, శోభా శెట్టి, దామిణి ఇలా అందరూ ఏడుస్తూ షకీలని సాగనంపారు.
ఆ తర్వాత షకీల స్టేజ్ మీదకి వచ్చాక ఎమోషనల్ అయింది. 'నాని' సినిమాలోని 'పెదవే పలికిన మాటాల్లోనే తీయని మాటే అమ్మ' అంటూ షకీ అమ్మ కోసం దామిణి పాడిన అటతో షకీల బాగా ఎమోషనల్ అయింది. ఆ తర్వాత హౌజ్ లో ఎవరు, ఎలాంటివాళ్ళో చెప్పాలని షకీలని నాగార్జున కోరాడు. ఫ్రెండ్లీ నేచర్ ప్రియాంక అని షకీల చెప్పింది. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ఆవేశపరులని, ప్రిన్స్ యావర్ కుళ్ళుబోతని, దామిణి నమ్మకస్తులని, రతిక స్టోన్ హార్టెడ్, శివాజీ అందరికి ఆనందం పంచుతున్నాడని ఇలా ఒక్కో కంటెస్టెంట్ కి ఒక్కో క్యారెక్టర్ ఐడెంటిటీ ఇచ్చింది షకీల. ఇలా షకీ అమ్మగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది షకీల. రెండవ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టిన షకీల, రెండవ వారం హౌజ్ నుండి బయటకొచ్చేసింది.