English | Telugu
బెస్ట్ కెప్టెన్ శివాజీనే అంటూ నాగార్జున ప్రశంసల వర్షం!
Updated : Sep 17, 2023
బిగ్ బాస్ హౌజ్ లో వారానికొకరు హౌజ్ మేట్ గా కన్ఫమ్ అవుతున్నారు. కాగా గతవారమంతా జరిగినే టాస్క్ లలో ఆడి గెలిచిన ఆట సందీప్ కి మొదటి పవరస్త్ర లభించింది. దాంతో బిగ్ బాస్ సీజన్-7 లో మొదటి హౌజ్ మేట్ గా ఆట సందీప్ నిలిచాడు. కాగా ఈ వారం జరిగిన టాస్క్ లో రణధీర్ టీమ్ కి కెప్టెన్ గా చేసిన శివాజీకి నాగార్జున ప్రశంసల వర్షం కురిపించాడు.
అయితే వారమంతా పుల్ రాజా పుల్, కలర్స్ పెడల్ లాండి గేమ్స్ ఆడించిన బిగ్ బాస్.. రణధీర, మహాబలి టీమ్ లుగా విభజించాడు. రణధీర టీమ్ లో ప్రియాంక సింగ్, అమర్ దీప్, శివాజీ, షకీల, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ ఉన్నారు. కాగా వాళ్ళు ఆ టాస్క్ గెలిచి ఒక 'కీ' ని సాధిస్తారు. అయితే ఆ 'కీ' ని దొంగింలించడానికి ప్రత్యర్థి మహాబలి టీమ్ లోని కంటెస్టెంట్స్ వెతుకుతుంటారు. కానీ శివాజీ వారికి క్లూ అని చెప్పి.. 'అదొక రోజా వనం అది దాటితే తామరలు' అంటూ రతికకి చెప్పాడు. దాంతో ఆ టీమ్ అంతా రోజెస్ ఉన్న ప్లేస్ లలో ఆ కీ కోసం వెతుకుతారు. కానీ వాళ్ళకి దొరకదు. అదే విషయాన్ని నాగార్జున నిన్న జరిగిన శనివారం నాటి ఎపిసోడ్‌లో వివరించాడు. నువ్వు మీ టీమ్ ని లీడ్ చేసిన విధానం సూపర్ అంటూ పొగిడాడు.
హౌజ్ లోని ఒక్కొక్కరి పర్ఫామెన్స్ గురించి రెడ్, గ్రీన్, ఆరెంజ్ అని ఇచ్చాడు నాగార్జున. కాగా పల్లవి ప్రశాంత్ కి, శివాజీకి గ్రీన్ ఇచ్చాడు. మిగతా కంటెస్టెంట్స్ అందరికి రెడ్ అండ్ ఆరెంజ్ ఇచ్చాడు నాగార్జున. ఇక టేస్టీ తేజ హౌజ్ లో ఎలా ఉంటాడో చూపించాడు నాగార్జున. పనేం చేయడని, గేమ్ లేదని టేస్టీ తేజని అన్నాడు నాగార్జున. శివాజీని చూపిస్తూ యూ ఆర్ ది బెస్ట్ అంటూ నాగార్జున ప్రశంసించాడు. ఇక హౌజ్ లోని వారిని లీడ్ చేసిన దాని గురించి మాట్లాడాడు. ఇక సెకండ్ వీక్ లో బాగా ఆడి పవరస్త్రని సాధించిన కంటెస్టెంట్ శివాజీ. దాంతో శివాజీ సెకండ్ హౌజ్ మేట్ గా కన్ఫమ్ అయ్యాడు. అయితే పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, షకీల నామినేషన్లో ఉన్నారు.