English | Telugu
బిగ్ బాస్ సోది టాపిక్.. ఇప్పటికే చాలామంది బై బై చెప్పేసారు
Updated : Sep 18, 2023
టాలీవుడ్ హీరోయిన్ మాధవిలత అందరికీ తెలిసిన హీరోయిన్. "నచ్చావులే" మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ క్యూట్ బేబీ మొదటి సినిమాతోనే సక్సెస్ కొట్టింది. 2008లో విడుదలైన నచ్చావులే మూవీ హిట్ టాక్ అందుకొనేసరికి "స్నేహితుడా, అరవింద్-2 " వంటి మూవీస్ లో కనిపించింది. అంతే కాకుండా మహేష్ బాబు మూవీ అతిథిలో హీరోయిన్ ఫ్రెండ్ గా ఒక రోల్ చేసింది. ఆ తర్వాత మూవీస్ సెక్షన్ వదిలేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. వీడియోస్, షార్ట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు పోస్టులతో ఫాన్స్ ని పలకరిస్తూనే ఉంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా బిగ్ బాస్ షోపై హాట్ అండ్ ఇంటరెస్టింగ్ అండ్ హార్ష్ కామెంట్స్ చేసింది. తన ఇన్స్టా స్టోరీలో చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మాధవిలత పోస్ట్ ఎం రాసింది అంటే .. 'బిగ్ బాస్ షో 100 శాతం కమర్షియల్. అందులో సామాన్యులను తీసుకోవాలి అనే డిమాండ్ సోది టాపిక్. సామాన్యులను పెడితే ఎవడూ చూడడు. టీఆర్పీ రాదు. పిచ్చి ఆలోచనలు మానేసి చూసేటోళ్లు చూడండి అంతే కానీ ఎవరిని హౌస్ లో పెడితే చూస్తారో వాళ్లనే పెడతారు. ఈ సీజన్ కి చాలామందిని ట్రై చేశారు. మీ పైసలు వద్దు, పబ్లిసిటీ వద్దు. మాకు ఇజ్జత్ ముఖ్యం అంటూ చాలామంది బిగ్ బాస్ కి బైబై చెప్పేసారు. అందుకే ఉన్నావాళ్లతో అడ్జస్ట్ అవ్వండి. నన్ను చూడమని అడగొద్దు' అంటూ పోస్ట్ చేసింది.
అయితే ఈ పోస్ట్ ఎవరినీ ఉద్దేశించి ఇంత ఘాటైన పదాలతో పెట్టిందో అర్థం కావడం లేదు. ఈ సీజన్లో సామాన్యుని కేటగిరీలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పల్లె బిడ్డ ఐనా కూడా గేమ్ బాగానే ఆడుతున్నాడు, సింపతీ కార్డు కూడా బాగా వాడుతున్నాడు. మరీ మాధవిలత చేసిన ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి అంటూ టాలీవుడ్ లో గుసగుసలాడుకుంటున్నారు.