English | Telugu

Bigg Boss 9 Sanjana Elimination: గేట్స్ ఓపెన్... సంజన ఎగ్జిట్... రాత్రిపూట డీమాన్ పవన్‌తో రీతూ చౌదరి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. ఫ్రెండ్ షిప్ కి బాండింగ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చింది. ఈ వారం ఎవరు ఊహించని విధంగా నామినేషన్ ప్రక్రియ సాగింది. రీతూ కెప్టెన్ అవ్వడంతో తనని ఎవరు నామినేట్ చెయ్యడానికి వీలు లేదు. అయితే రీతూ ఇద్దరిని నామినేట్ చేసింది. మొదటి నామినేషన్ కళ్యాణ్ ని చేయగా.. రెండో నామినేషన్ సంజనని చేసింది. ఇక ఆ తర్వాత తన రీజన్లు చెప్పింది రీతు.

సంజన గారు.. మీరు మొదటి రెండు వారాలు మాత్రమే కనిపించారు మీరు. ఇప్పటికే గేమ్ చివరి వరకు వచ్చింది కానీ మీరు కనిపించడం లేదని రీతూ అంది. దాంతో అంటే ఇన్ని వారాలు నేను నిద్రపోతూ ఉంటే ఇక్కడివరకు వచ్చానా.. నీలాగా గట్టిగా అరవడం.. బూతులు మాట్లాడడం నాకు రాదని సంజన ఫైర్ అయ్యింది. నేనేం బూతులు మాట్లాడాను.. నీలాగా నేనేం మాట్లాడలేదంటూ రీతూ .. ఏం మాట్లాడావో అందరికి తెలుసు అంటు సంజన ఇద్దరు కొట్టుకున్నంత పని చేశారు. నాకు తెలుసు.. నువ్వు రోజు ఏం చేస్తావో.. రోజు రాత్రి డీమాన్ తో కూర్చుంటావ్ అంటూనే కళ్లు మూసుకోవాల్సి వస్తుంది అని సంజన నోరుజారింది. అసలు ఏం మాట్లాడతున్నారు మీరు.. నేషనల్ టెలివిజన్ ముందు ఒక అమ్మాయి క్యారెక్టర్ పై ముద్ర వెయ్యడం కరెక్ట్ కాదని రీతూ ఏడుస్తుంది. ఇక అప్పుడే ఇమ్మాన్యుయల్ వస్తాడు. మీరు మాట్లాడింది తప్పు దాన్ని వెనక్కి తీస్కోండి అని అంటాడు. కానీ తను వెనక్కి తీసుకోనని అంటుంది. సంజన ఆ మాట అన్నందుకు హౌస్ మొత్తం సంజనకి వ్యతిరేకంగా మాట్లాడుతారు.

రీతూ ఏడుస్తుంటే. నువ్వు ఏం తప్పు చేసావని ఏడుస్తున్నావ్.. ఏడిస్తే నువ్వు తప్పు చేసావని ఒప్పుకున్నట్లే అని తనూజ అంటుంది. కాసేపటికి సంజన దగ్గరికి డీమాన్ వస్తాడు. అక్క అలా మాట్లాడ్డం కరెక్ట్ కాదు.. ఇద్దరం ఫ్రెండ్స్ పక్కపక్కన కూర్చుంటే తప్పుగా మాట్లాడతారా అని డీమాన్ అంటాడు. అలా హౌస్ మొత్తం వ్యతిరేకంగా మాట్లాడినా సంజన తన వైఖరి అసలు మార్చుకోదు. గతంలో దొంగతనాలు చేసినప్పుడు.. మెడలో బోర్డు వేసి నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. సుమన్ శెట్టిని ఫెయిల్డ్ కెప్టెన్ అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు సంజన విమర్శలు ఎదుర్కొంది. అప్పుడు నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. మరి ఈ సారీ వార్నింగ్ లు అంటూ ఏమీ ఉండవు.. డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇవ్వడం.. గేట్స్ ఓపెన్ అవ్వడం.. సంజన ఎగ్జిట్ అవ్వడం ఖాయమనిపిస్తోంది. అయితే సంజన చేసిన ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.