English | Telugu

Illu illalu pillalu : భాగ్యం బిజినెస్ ఐడియా నచ్చి పది లక్షలు ఇచ్చిన రామరాజు.. కోడళ్ళు షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -325 లో..... వేదవతి దగ్గరికి నర్మద వస్తుంది. అత్తయ్య అంటే ఇష్టం అంటారు కానీ ఎవరు ఈ అత్తయ్య కి చెప్పారు. భర్తని గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేయిస్తుందని వేదవతి కోపంగా అంటుంది. అప్పుడే ప్రేమ వస్తుంది. వచ్చింది పోలీస్ ఆఫీసర్ అని ప్రేమపై కూడా వేదవతి కోపంగా మాట్లాడుతుంది. మరొవైపు ఇంట్లో సిచువేషన్ మొత్తం శ్రీవల్లి తన పేరెంట్స్ కి చెప్తుంది. వాళ్ళు రామరాజు దగ్గర బిజినెస్ స్టార్ట్ చేస్తామని డబ్బు తీసుకోవాలని అనుకుంటారు.

భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు దగ్గరికి వస్తారు. అందరు ఏంటి డల్ గా ఉన్నారు. ఏదైనా గొడవ జరిగిందా ఏంటని భాగ్యం ఏం తెలియనట్లు అడుగుతుంది. అసలు విషయం చెప్పమ్మా అని రామరాజు తనపై చిరాకుపడతాడు. ఈ రోజుల్లో ఒక వయసు రాగానే తల్లిదండ్రులని వదిలించుకోవాలని అనుకుంటున్నారు కదా అలా వదిలేసిన తల్లిదండ్రులని మేమ్ చూసుకుంటాం.. అలా వాళ్ళ దగ్గర నుండి డబ్బు నెలనెలా తీసుకుంటాం.. ఇలా ఒక బిజినెస్ మొదలుపెడుదామనుకుంటున్నాం అన్నయ్య.. ఎవరికి ఆ పరిస్థితి వస్తుందో తెలియదు కదా.. పెళ్ళాలు వచ్చినాకనే కొందరు మారిపోతున్నారని భాగ్యం అంటుంది. ఒక పది లక్షలు ఇవ్వండి అని అంటుంది. నాకు మీ ఆలోచన నచ్చిందని పది లక్షలు ఇస్తాడు. మావయ్య గారు కొంచెం ఆలోచించండి అని ప్రేమ, నర్మద అంటారు. మీలాగా వాళ్ళు నమ్మకద్రోహం చేయడం లేదు.. చేసే పని ముందే చెప్తున్నారని రామరాజు అంటాడు.

ఆ డబ్బు తీసుకొని భాగ్యం, ఆనందరావు బయటకు వచ్చి ప్లాన్ సక్సెస్ అనుకుంటారు. అప్పుడే నర్మద అటుగా వెళ్తుంటే.. పిలిచి మరీ భాగ్యం గొడవపెట్టుకుంటుంది. మరొకవైపు శ్రీవల్లి అనుకుంది జరిగిందని సంతోషపడుతుంది. ఆ తర్వాత రేవతి నగలన్నీ తీసుకొని హాల్లోకి వస్తుంది. ఈ నగలన్నీ మెరుగుపెట్టించి తీసుకొనిరా అని సేనాపతికి భద్రవతి చెప్తుంది. నగలు ఏంటి గిల్టీ నగలులాగా వెయిట్ తక్కువ ఉన్నాయని సేనాపతి అనగానే వాటి గురించి నీకేం తెలియదని భద్రవతి అంటుంది. గతంలో శ్రీవల్లి నగలు మార్చి గిల్టీ నగలు పెట్టి పంపిస్తుంది. ఆ విషయం ఇప్పుడు అందరికి తెలియనుందా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.