English | Telugu
శోభాశెట్టి కోసం ఆట సందీప్ ఎలిమినేషన్.. ఇదే బిగ్ బాస్ ట్విస్ట్!
Updated : Oct 30, 2023
బిగ్ బాస్ సీజన్-7 చాలా ట్విస్ట్ లతో కొనసాగుతుంది. వారం వారం హౌస్ లో ట్విస్ట్ లు మాములుగా లేవు. ఇప్పటికి హౌస్ లో గత ఏడు వారాల నుండి ఏడుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అయ్యారు.
అయితే ఎనిమిదవ వారం ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో హౌస్ లోని వాళ్ళంతా తలలు పట్టుకున్నారు. హౌస్ లోని వాళ్ళే కాదు బిగ్ బాస్ అభిమానులకి కూడా మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే శోభాశెట్టి ఎలిమినేషన్ అవ్వాలని.. హౌస్ లోని మిగతా కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ మొత్తం లీస్ట్ లో ఉన్న ఆట సందీప్, అశ్వినికి ఓట్లు చేశారు. దాంతో అనఫీషియల్ ఓటింగ్ లో శోభాశెట్టి లీస్ట్ లో ఉంది. ఆట సందీప్ కొన్ని ఓట్ల తేడాతో పైన ఉన్నాడు. అయితే శోభాశెట్టి స్టార్ మా బ్యాచ్ కాబట్టి ఎలిమినేషన్ అవ్వకుండా ఆపారని బయట టాక్ నడుస్తుంది. హోస్ట్ నాగార్జున కూడా దీనిపై క్లూ ఇచ్చేశాడు. " ఏడు వారాల నుండి నామినేషన్లో లేవు కదా? మొదడి వారం నుండి నామినేషన్లో ఉంటే బయట ఫాలోయింగ్ ఏర్పడేది" అంటు నాగార్జున అన్నాడు.
అసలు ఈ వారం శోభాశెట్టి ఎలిమినేషన్ అవ్వాలి కానీ ఆడ సందీప్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అయ్యాడు. దీనికి కారణం.. శోభాశెట్టి కంటెంట్ ఇస్తుంది. ఆటలో ఎన్ని ఫౌల్స్ ఆడినా, నెగెటివిటి వచ్చిన తను కంటెంట్ ఇస్తుంది. పైగా ఫీమేల్ కంటెస్టెంట్. గత ఏడు వారాలుగా ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారని భావించిన బిగ్ బాస్ ఈసారి ఆట సందీప్ ని బయటకు పంపించేసినట్టుగా తెలుస్తుంది. మరి ఆడియన్స్ ఓటింగ్ కి ఇంపార్టెంట్ లేదా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.