English | Telugu

ఆట సందీప్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ హౌస్ లో ఏడు వారాలు నామినేషన్లో లేకుండా ఎనిమిదవ వారం నామినేషన్లోకి వచ్చి ఎలిమినేట్ అయిన ఏకైక కంటెస్టెంట్ ఆట సందీప్. ఇతడికి హౌస్ లో చాలావరకు పాజిటివిటి ఉంది. ఎవరు ఇతడిని నామినేట్ చేయకపోవడం ఇతడికి మైనస్ అయిందా అంటే అవుననే చెప్పాలి.

ఆట సందీప్ కి పాజిటివిటి ఉంది కానీ అతడు చేసిందల్లా సీరియల్ బ్యాచ్ తో కలిసి ఉండటమే అని అందరికి తెలిసిందే. అయితే ఆట సందీప్ మొదటి హౌస్ మేట్ అయి అయిదువారాల ఇమ్యూనిటి పొంది నామినేషన్లో లేడు. ఆ తర్వాత ఆరవ వారం నామినేషన్లో ఉన్నాడు. అప్పుడే అశ్వత్థామ 2.0 అంటూ గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ నుండి వచ్చి తన పవర్ యూజ్ చేసి నామినేషన్లో ఉన్న ఆట సందీప్ ని తప్పించాడు. అయితే ఆట సందీప్ ని ఇద్దరే నామినేట్ చేశారు. మొదట యావర్ వచ్చి..‌ నువ్వు సేఫ్ ప్లేయర్ అని నామినేట్ చేశాడు. ఇక టేస్టి తేజ.. బ్రో నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ వి, అందుకే నామినేట్ చేస్తున్నానంటూ నామినేట్ చేశాడు. బయట ఫ్యాన్ బేస్ లేకపోవడంతో ఎక్కువ ఓటింగ్ పొందలేకపోయాడు ఆట సందీప్.

ఇక హౌస్ లో చాలాసార్లు సంచాలకుడిగా చేసిన ఆట సందీప్.. ప్రతీసారీ అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ లకి సపోర్ట్ గా రిజల్ట్ చెప్పడంతో సంచాలకుడిగా మళ్లీ ఫెయిల్ అయ్యావంటూ నాగార్జున చాలాసార్లు అన్నాడు. ఇక ఆట సందీప్ ప్రతీ టాస్క్ లో ఫౌల్స్ ఆడటం, ఫెయిర్ గేమ్ ఆడకపోవడం, గేమ్ ని సరిగ్గా అర్థం చేసుకొని ఆడకపోవడంతో జనాల దృష్టిలో నెగెటివిటిని సొంతం చేసుకున్నాడు. ఆట సందీప్ బిగ్ బాస్ హౌస్ లో ఒక రోజుకి గాను 39 వేల రూపాయలు, వారానికి 2 లక్షల డెబ్బై అయిదు వేలు తీసుకోగ, ఇక ఎనిమిది వారాలకి గాను 22 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది.