English | Telugu

లాస్యకు సాయికుమార్ క్రీమ్ బిస్కెట్!

బుల్లితెర వీక్షకులను ప్రస్తుతం ఎంటర్టైన్ చేస్తున్న రియాలిటీ షోల్లో 'బిగ్ బాస్' సీజన్ ఫైవ్ ఒకటి. యాంకర్ రవి, యూట్యూబర్లు షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంతు, సింగర్ శ్రీరామచంద్ర, యాక్టర్లు లహరి, హమీదా తదితరులు ఉన్నారు. 'బిగ్ బాస్ 4'లోనూ యాంకర్, సింగర్, యాక్టర్, న్యూస్ రీడర్ ఇలా అన్ని వర్గాల వాళ్లు ఉన్నారు. అందులో నలుగుర్ని 'వావ్' షోకి తీసుకొచ్చారు.

యాంకర్ లాస్య మంజునాథ్, యాక్టర్ కమ్ సింగర్ అండ్ ర్యాపర్ నోయల్ సేన్, యూట్యూబర్ మెహబాబ్, న్యూస్ రీడర్ జోర్దార్ సుజాత నెక్స్ట్ వీక్ 'వావ్' షోలో సందడి చేయనున్నారు. నలుగురిలో లాస్య గతంలో ఒకసారి 'వావ్'కి వెళ్లారు.

"లాస్య... ఆల్రెడీ 'వావ్'కి వచ్చినట్టు ఉన్నావ్ కదా?" అని సాయికుమార్ అడిగితే... "ఎప్పుడో మూడేళ్ళ క్రితం సార్" అని లాస్య చెప్పింది. "అప్పుడు అలాగే ఉన్నావ్. ఇప్పుడు అలాగే ఉన్నావ్. ఎప్పుడూ అలాగే ఉంటావ్ ఏమో! రాయచోటి... కడప... పవర్" అని సాయికుమార్ అనడంతో లాస్య చాలా హ్యాపీ ఫీల్ అయింది. అయితే, మైక్ లో 'క్రీమ్ బిస్కెట్' అని వాయిస్ రావడంతో 'కాదు కాదు' అంటూ లాస్య నవ్వేసింది. షోలో 'బిగ్ బాస్ 4' బ్యాచ్ ఎంత సందడి చేశారో వచ్చే వారం తెలుస్తుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.