English | Telugu

సదా కోసం వచ్చిన సాగర్...ఆ సాంగ్ స్పెషల్ గా ఆయన కోసమే

నీతోనే డాన్స్ ఈ వీక్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో అద్దిరిపోయే ట్విస్టులు ఉన్నాయి. సీజన్ 1 కంటెస్టెంట్స్ అంతా వచ్చేసరికి స్టేజి కళకళలాడిపోయింది. ఇక స్పెషల్ పర్సన్ వచ్చేసరికి సదా ఫేస్ ఇంకా కళకళలాడిపోయింది. వీళ్లందరినీ చూసేసరికి నీతోనే డాన్స్ 3 . 0 అని అంది శ్రీముఖి. ఆట సందీప్, యాని మాష్టర్, నటరాజ్, మెహబూబ్, అంజలి తో పాటు అసలు సిసలైన సదా మనసు దోచుకున్న సాగర్ వచ్చాడు. ఆ సీజన్ లో సాగర్ అంటే చాలు సదా మనసు ఒక పాటేసుకునేది. ఈ సీజన్ లో బ్రిట్టోని చూస్తే అలా పాటేసుకుంటున్న సదా సాగర్ ని చూసేసరికి ఎగురుకుంటూ స్టేజి మీదకు వెళ్లి డాన్స్ చేసింది.

అది కూడా "తేలికైన మాటలే పెదవి దాటవెందుకో" అనే సాంగ్ కి సాగర్ తో మైమరిచి స్టెప్పులేసింది సదా. అలాగే ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ సాంగ్ కేవలం సాగర్ వచ్చినప్పుడు మాత్రమే ప్లే చేయాలి..ఇంకెవరు వచ్చినా కాదు అని చెప్పేసింది. ఇక ఈ షోకి అవినాష్ లేడీ గెటప్ లో వచ్చి తరుణ్ మాష్టర్ తో పరాచికాలు ఆడడం ఫన్నీగా అనిపించింది. ఇక వాసంతి కృష్ణన్, మెహబూబ్, యావర్ చేసిన డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. తీన్ మార్ స్పెషల్ తో ఈ వారం ఎపిసోడ్ రాబోతోంది. దాంతో ముగ్గురు డాన్సర్స్ ఒక టీమ్ గా డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. ఏ డాన్స్ కి ఆ డాన్స్ హైలైట్ గా నిలిచింది. ఇక లాస్ట్ లో భానుశ్రీ, మానస్, ఆట సందీప్ చేసిన సాంగ్ కి ఐతే గూస్ బంప్స్ వచ్చేసాయి.