English | Telugu

వెళ్లి అద్దంలో ముఖం చూసుకోమని హేళన చేశారు.. కంటతడిపెట్టిన బిగ్ బాస్ కీర్తి భట్!


కార్తీకదీపం ఫేమ్.. బిగ్ బాస్ సీజన్ సిక్స్ బ్యూటీ.. మధురానగరిలో హీరోయిన్ కీర్తి భట్ అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో చక్కగా ఆడి ఫైనల్ వరకు వెళ్ళింది. టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచింది కీర్తి.

‘మనసిచ్చి చూడు’ సీరియల్‌తో పేరు తెచ్చుకున్న కీర్తి.. ప్రస్తుతం ‘మధురానగరిలో ’సీరియల్‌ లీడ్ రోల్ చేస్తుంది. అయితే మొన్నటి వరకూ తాను అనాధనని కన్నీటి పర్యంతం అయిన కీర్తికి అండగా నిలిచాడు రియల్ హీరో కార్తీక్. కొన్నేళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్‌లో కీర్తి భట్ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. అమ్మ, నాన్న, అన్న, వదిన.. అన్న పిల్లలు మొత్తం చనిపోగా.. కీర్తి ఒక్కతే తీవ్ర గాయాలతో బతికింది. చానాళ్లు కోమాలో ఉండి ప్రాణాలతో బయటపడింది. అయితే ఆ ప్రమాదంలో ఆమె కడుపుకి బలమైన గాయం తగలడంతో.. ఆపరేషన్ చేసి.. ఆమె గర్భసంచి తీసేశారు. దీంతో ఆమెకు ఇక జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదు. అయితే ఆ విషయం తెలిసిన కూడా కార్తీక్.. కీర్తిని భార్యగా పొందటానికి అంగీకరించాడు.

తాజాగా కీర్తి ‘కాఫీ విత్ శోభా’ ప్రోగ్రాంలో పాల్గొని సందడి చేసింది. కాబోయే భర్త కార్తిక్ తో కలిసి ఈ షోలో పాల్గొన్నది. ఈ సందర్భంగా తను ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటి నుంచి బయట పడేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి వివరించింది. కార్తిక్ తో పరిచయం, నిశ్చాతార్థం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అవకాశం కోసం ఒక దగ్గరికి వెళ్ళగా ఆ మేనేజర్ ఇలా అన్నాడంటు కీర్తి చెప్పుకొచ్చింది. ఓ సీరియల్ ఆడిషన్ కు వెళ్లాను. ఓ పేపర్ ఇచ్చారు. ఆడిషన్ చేశారు. సర్.. మమ్మల్ని సెలెక్ట్ చేశారా అని అడిగాను. నీ ముఖం అద్దంలో చూసుకున్నావా అని ఆ ప్రొడక్షన్ మేనేజర్ అన్నారు. అదే సీరియల్ లో రెండు సంవత్సరాల తర్వాత నేను మెయిన్ లీడ్ చేశాను. అప్పుడు అదే ప్రొడక్షన్ మేనేజర్ తో నేను పక్కన కూర్చొని.. సర్ ఇప్పుడు నా ముఖం బాగుందా అని అడిగాను. తను సిగ్గుతో తల దించుకున్నాడని కీర్తి భట్ చెప్పింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.