English | Telugu
పెళ్ళాం ఫర్నిచర్ లాంటిది ఇంట్లోనే ఉంటది...బుల్లెట్ భాస్కర్ కామెంట్స్ వైరల్
Updated : May 23, 2024
ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో బులెట్ భాస్కర్ కామెడీ స్కిట్ ఫుల్ గా నవ్వు తెప్పించింది. జడ్జ్ కుష్బూని చూస్తే చాలు భాస్కర్ కి ఆటోమేటిక్ గా పంచ్ లు వస్తాయని తెలుసు కదా. ఈ వారం స్కిట్ లో కూడా అలాంటి పంచులు వేసాడు. చేతిలో చుట్ట పట్టుకుని తాగుతూ పల్లెటూరిలో ఉండే పెద్ద మోతుబరిలా కనిపించాడు. మళ్ళీ పక్కన ఒక అసిస్టెంట్ జిత్తు కూడా ఉన్నాడు. "అబ్బబ్బా ఎం ఉందిరా" అని ఖుష్భుని భాస్కర్ అనేసరికి "అయ్యా" అంటూ పక్కన జిత్తు భాస్కర్ ని ఆపేసాడు.
"పొద్దుపొద్దునే సుట్ట తాగితే ఏమున్నది అన్నాను" అంటూ కవర్ చేసుకున్నాడు. తర్వాత రష్మీ వైపు తిరిగి "ఇది కూడా బాగుంది" అని ఆమె మీద కూడా డైలాగ్ వేసేసరికి "అయ్యా" అన్నాడు మళ్ళీ జిత్తు. "అంటే ఈ చేత్తో కూడా చుట్ట తాగితే చాలాబాగుంది అంటున్నా" అంటూ కవర్ చేసుకున్నాడు. దానికి జిత్తుకి బాగా కోపం వచ్చేసింది. "సిగ్గులేదా ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని అందరి చుట్టూ తిరుగుతారు అట్లా" అన్నాడు. "పెళ్ళాం అనేది ఫర్నిచర్ లాంటిది ఇంట్లోనే ఉండాలి..ఫిగర్ అనేది పెర్ఫ్యూమ్ లాంటిది" అంటూ లేడీస్ గురించి చెప్పాడు. ఇక రౌడీ రోహిణి - ఆటో రాంప్రసాద్ ఇద్దరూ కలిసి చేసిన స్కిట్ ఫుల్ ఫన్నీగా ఉంది. రోహిణి కొత్త శారీ కొనుక్కోవడం ఆ సారీ నుంచి పెర్ఫ్యూమ్ స్మెల్ వస్తుండేసరికి రాంప్రసాద్ అనుమాన పడడం తర్వాత దొరబాబు తన అలా ఫ్రెండ్ రోహిణిని కలుసుకోవడానికి వచ్చి రాంప్రసాద్ చేతిలో తన్నులు తినడం ఫుల్ ఫన్నీగా ఉంది. ఇలా ఈ వారం ఈ షో ఎంటర్టైన్ చేయబోతోంది.