English | Telugu

Krishna Mukundha Murari : ఎక్కడికెళ్ళిన భార్య  జ్ఞాపకాలే.. పడిపడి లేచే మనసు కథేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -311 లో.. రేవతి మధు ఇద్దరు కలిసి కృష్ణ, మురారీలని ఎక్కడికైన పంపింద్దామని అనుకుంటారు‌. అప్పుడే భవాని వచ్చి మధు చెంప చెల్లుమనిపిస్తుంది. కృష్ణని క్షేమించే ప్రసక్తే లేదు అన్నట్లుగా భవాని చాలా కఠినంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత అసలు ఇదంతా చేసింది వాళ్ళు అయి ఉండరేమోనని రేవతి అంటుంది. ఎక్కడ తన భాగోతం బయటపడుతుందోనని భావించిన ముకుంద.. ఏంటి పెద్ద అత్తయ్య మాటకే ఎదరు చెప్తున్నారా అని అంటుంది.

మరొకవైపు కృష్ణ, మురారి కలిసి వస్తు ఉండడం భవాని కోపంగా చూస్తుంది. వేణి నువ్వు వెళ్ళు. నేను మురారీతో మాట్లాడాలని భవాని అంటుంది. లోపల ఎంత కోపంగా ఉన్న మురారి కోసం కృష్ణతో నవ్వుతు మాట్లాడుతుంది భవాని. కాసేపటికి కృష్ణ వెళ్లిపోతుంది. మురారి అమెరికా వెళ్తున్నాడని కృష్ణ చాలా బాధపడుతుంది. మరొకవైపు శకుంతల కృష్ణని చూడడానికి ఇంటికి వస్తుంది. శకుంతలని చుస్తుంది భవాని. తనతో మాట్లాడడం ఇష్టం లేక రేవతిని పిలిచి ఎందుకు వచ్చిందో కనుక్కొని వెళ్ళిపోమని చెప్పని భవాని అనగానే..

రేవతి తనని పంపించబోతు ఉంటుంది. అప్పుడే శకుంతలని మురారి చూసి ఆగండి. మీరు వేణి వాళ్ళ రిలేషన్ కదా అని అంటాడు. అవునని శకుంతల అంటుంది. తను మురారిని అల్లుడని పిలవకముందే ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళు రేవతి అని భవాని చెప్పగానే.. పదా బయటకు వెళ్దామని రేవతి అంటుంది. తనకి కాఫీ గానీ టీ గానీ ఇవ్వండని మురారి అనగానే.. వాళ్ళు కాఫీ అలాంటివి తాగరని భవాని చెప్తుంది. కాసేపటికి వేణి దగ్గరికి తీసుకొని వెళ్తుంది రేవతి. వేణి వాళ్ళ రిలేషన్స్ ని కూడా నాకు దూరం పెడుతున్నారు ఎందకని భవానితో మురారి అనగానే.. నువ్వు ప్రతిసారి వేణి గారి గురించి మాట్లాడితే పెద్ద అత్తయ్యకి కోపం వస్తుందని ముకుంద అనగానే.. ఎందుకు వేణితో మాట్లాడనివ్వడం లేదు. నాకు పదే పదే వేణి గారే గుర్తుకు వస్తున్నారని మురారి అంటాడు. మురారికి భవాని కూల్ నచ్చజెప్పి.. తననోటి వెంటే ' కృష్ణతో మాట్లాడకుండా ఉండటానికి ట్రై చేస్తాను' అనేలా భవాని చేస్తుంది.

మరొకవైపు శకుంతల కృష్ణ సిచువేషన్ గురించి రేవతికి చెప్తూ బాధపడుతుంది. నువ్వు ఏం టెన్షన్ పడకు చిన్నమ్మ అంత సెట్ అవుతుందని శకుంతలకి కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి వచ్చి మురారి మాట్లాడతాడు. ఒకవైపు మురారి ఎక్కడ అని ముకుందని భవాని అడుగుతుంది. అప్పుడే మురారి కృష్ణ దగ్గరికి వెళ్లి ఇంటిలోకి వస్తాడు. ఎక్కడికి వెళ్ళావ్ వేణి దగ్గర నుండి వస్తున్నావా అని మురారిని భవాని అడుగుతుంది. మురారి సైలెంట్ గా ఉంటాడు. ఎందుకు సైలెంట్ గా ఉన్నావ భవాని అడగ్గానే.. మీకు అబద్ధం చెప్పడం ఇష్టం లేక మౌనంగా ఉన్నానని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.