English | Telugu

కృష్ణ, మురారీలకు మళ్ళీ పెళ్ళి.. మరి ముకుంద పరిస్థితేంటి!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -231 లో.. కృష్ణకి భవాని ఏడువారాల నగలు వేసి రెడీ చేస్తుంది. కృష్ణని చూసి భవాని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కృష్ణ మాత్రం నేను మోసం చేస్తున్నానని మనసులో అనుకొని ఏడుస్తుంది. ఏమైందని భవాని అడుగుగా.. మా అమ్మ నాన్న గుర్తుకువచ్చారని కృష్ణ అంటుంది. అప్పుడు భవాని కృష్ణని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటుంది.

ఆ తర్వాత కృష్ణ ఒక్కతే కూర్చొని ఇంట్లో వాళ్ళతో సరదాగా ఉన్న జ్ఞాపకాలు గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు కృష్ణ గురించి ఆలోచిస్తుంటాడు మురారి. అందరికి అగ్రిమెంట్ విషయం చెప్పమని అంటుందంటే తనకి ఈ మాంగల్యధారణ ఇష్టం లేదు అన్నట్లే కదా.. నేను తన జీవితంతో ఆడుకుంటున్నా అనుకుంటుందని మురారి అనుకుంటాడు. అప్పుడే అక్కడికి నందు వస్తుంది. నాకు కృష్ణపై చాలా కోపంగా ఉంది. నువ్వు ఒట్టేసావ్ కాబట్టి సైలెంట్ గా ఉంటున్నా లేదంటే అమ్మ కి చెప్పి మిమ్మల్ని ఒకటి చేసేదాన్ని అని మురారితో నందు అంటుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి అలేఖ్య వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్తుంది. ఆ తర్వాత ఇంట్లో పూజకి అంతా సిద్ధం చేస్తారు. నిండు మనసుతో నల్లపూసలు గుచ్చండి అని పంతులు గారు చెప్తారు. " వాళ్ళు నిండు మనసుతో దీవించి పూసలు గుచ్చితే, మరి నా ప్రేమ ఏం కావాలి అయిన వాళ్ళు విడిపోతున్నారు.. నేను వెళ్లి పూసలు గుచ్చుతాను" అని ముకుంద వెళ్లి పూసలు గుచ్చుతుంది. అది చూసిన రేవతి.. తను ఎందుకు పూసలు గుచ్చుతుంది. నేను అక్క ముందు అడగలేనన్న దైర్యంతో అలా చేస్తుందని రేవతి అనుకుంటుంది. రేవతి వైపు భవాని చూస్తూ.. ఏమైంది వీళ్ళందరికి రెండు మూడు రోజుల నుండి ఇలా ఉంటున్నారు. నా వెనకాల ఏదో జరుగుతుంది తెలుసుకోవాలని భవాని అనుకుంటుంది.

ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు రెడీ అయి కిందకి వస్తారు. వాళ్ళని రేవతి బాధగా చూస్తుంటుంది. ఏమైంది రేవతి ఎందుకు అలా ఉన్నావ్? అందరు మొన్నటి వరకు బానే ఉన్నారు.. ఇప్పుడు ఏమైందని భవాని అడుగుతుంది. వాళ్ళ మధ్య సమస్య ఉంది. ఈ మంగల్యధారణతో అది తొలగిపోవాలని రేవతి అంటుంది. చూద్దామని భవాని అంటుంది.ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు మంత్రాలు చదువుతారు. మురారి, కృష్ణ మేడలో తాళి కడతాడు. ఆ తర్వాత కృష్ణ ఆ తాళిని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.