English | Telugu
వాళ్ళ దృష్టిలో మనిమిద్దరం రిషీధారలమే!
Updated : Aug 10, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -837లో.. రౌడీ ఫోన్ కి శైలేంద్ర ఫోన్ చెయ్యడం.. ఆ వాయిస్ గుర్తుపట్టారా అని ఇన్‌స్పెక్టర్, అలాగే అప్పుడే వచ్చిన రిషి కూడా వసుధారని అడగడంతో.. తను గుర్తుపట్టాను చెప్తుంది. ఆ వాయిస్ మీ అన్నయ్య శైలేంద్రని చెప్తుంది. అంతే కాకుండా వసుధార చెప్పిందేది రిషి నమ్మనట్టు, అదంతా వసుధార ఉహించుకుంటుంది. ఆ తర్వాత వసుధారని ఇన్‌స్పెక్టర్ వాయిస్ విన్నారా అని అడుగుతాడు. అప్పుడే రిషి వస్తాడు. ఏదో దగ్గర వాళ్ళ గొంతులాగా అనిపించిందని వసుధార చెప్తుంది.
ఆ తర్వాత వసుధార వెళ్లిపోతుంటే.. మేడమ్ ఇక్కడ జరిగేది మీ మేడమ్, మా డాడ్ కి చెప్పకండి.. చెప్పి వాళ్ళని కంగారుపెట్టి ఇక్కడికి వచ్చేలా చెయ్యకండని రిషి అంటాడు. మరొకవైపు రౌడీ ఫోన్ రిషి దగ్గర వదిలేసి వెళ్లారు. ఇప్పుడు ఇదంతా నేనే చేశానని తెలుస్తే నా పరిస్థితేంటి.. వాడికి నిజం తెలియక ముందే వాన్ని లేపేయ్యలని శైలేంద్ర అనుకుంటాడు. మరొక వైపు రిషి క్లాస్ లో ఉండగా.. మీతో మాట్లాడాలని వసుధార మెసేజ్ చేస్తుంది. నాతో మాట్లాడేదేమీ లేదని రిషి ఆ మెసేజ్ కి రిప్లై ఇస్తాడు. అయిన సరే మీరు రావాలి. మీ కోసం వెయిట్ చేస్తున్నానని వసుధార అంటుంది. డోంట్ వెయిట్ నేను రాను, మాట్లాడనని రిషి అంటాడు. ఆర్డర్ వేస్తుందా తను చెప్పినట్టు నేనెందుకు వినాలని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత రిషి ఇంటికి వెళ్తుంటే సర్ మాట్లాడాలి ఆగండని వసుధార అంటుంది. అయిన కూడా రిషి వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఏంటో ఇంత పట్టుదల మాట్లాడితే ఏం అవుతుందని వసుధార అనుకుంటుంది. ఆ తర్వాత రిషి వెళ్తు.. వసుధార, విశ్వనాథ్ ఇంటికి వెళ్లినట్టు, రిషితో కోపంగా మాట్లాడినట్లు, వాళ్ళ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిన విషయం విశ్వనాథ్, ఏంజెల్ కి చెప్పినట్లు రిషి ఉహించుకుంటాడు. ఆ తర్వాత ఈ పొగరు అలానే చేస్తుందని అనుకొని వసుధార కంటే ముందే రిషి ఇంటికి వెళ్తాడు.
ఆ తర్వాత వసుధార ఇంటికి వస్తుంది. చక్రపాణి వసుధారకి ఎదురుగా వచ్చి.. అల్లుడు గారంటూ చెప్తుండగా.. హా అల్లుడు గారే మాట్లాడాలి. అంటే అసలు వినరు. నేను ఏమైనా సినిమాకి రమ్మన్నానా, షాపింగ్ కి రమ్మన్నానా అంటూ లోపలికి వెళ్లేసరికి.. రిషిని చూసి షాక్ అవుతుంది. ఏదో మాట్లాడాలని అన్నావ్ ఏంటని రిషి అడుగుతాడు. మీ గురించి మహేంద్ర సర్ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళ దృష్టిలో మనమిద్దరం ఒకటే రిషీధారలమే.. మీరు ఇన్‌స్పెక్టర్ కి కాల్ చేసి మనం ఇచ్చిన ఫోన్ గురించి ఎంత వరకు వచ్చిందో కనుక్కోండి అని రిషికి చెప్తుంది వసుధార. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.