English | Telugu

అఖిల్‌కి పెళ్లి చూపులు.. పెళ్లి కూతురు ఎవరంటే..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో రన్నర్ గా నిలిచిన అఖిల్ సార్థక్ కి సరైన బ్రేక్ దొరకలేదు. దాంతో సోషల్ మీడియాలో చాలా సైలెంట్ అయిపోయాడు. మూవీస్ కానీ వెబ్ సిరీస్ లాంటివి ఏమీ చేయడంలేదు. కొన్ని నెలల క్రితం నీతోనే డ్యాన్స్ షో అంటూ తేజస్వితో కలిసి అఖిల్ డ్యాన్స్ చేశాడు. అలాంటి అఖిల్ ఎప్పుడూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఆ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అఖిల్ పెళ్లి చూపులకు రెడీ అవుతున్నాడు. ఇంతకు ఏమిటి అనుకుంటున్నారా.. అఖిల్ వాళ్ళ అమ్మ పెళ్లి చూపుల కోసం రెడీ అవ్వు అని చెప్పినప్పుడు ఎలా రెడీ అవుతున్నాడో చూపించాడు. మంచి డ్రెస్ వేసుకుని టక్ చేసి పదేపదే అద్దంలో చూసుకుంటూ ఉన్నాడు అఖిల్. పెళ్లి చూపులు అంటే సాంప్రదాయ దుస్తుల్లో కాకుండా రెగ్యులర్ ఫార్మల్ వేర్ వేసుకుని స్మార్ట్ గా పెళ్లి చూపులకు వెళ్తే ఎలా ఉంటుంది.

పెళ్లి చూపుల్లో అమ్మాయి తననే చూస్తూ ఉంటే ఆమె కళ్ళల్లో కనిపించే ఆనందం చూస్తే ఎంతో బాగుంటుంది కదా..ఇలా ఊహించుకుంటూ పెళ్లి చూపులకు రెడీ అవుతూనే ఉన్నాడు. కానీ సమస్య ఏమిటి అంటే పెళ్లి కూతురు ఎక్కడసలు ? అని అఖిల్ అడిగినప్పుడు అప్పుడు వాళ్ళ అమ్మా "కంగారు పడకు ఈ విశ్వంలో నీకోసం ఎవరో ఒక అమ్మాయి పుట్టే ఉంటుందిలే" అని ఆన్సర్ ఇస్తే భలే ఉంటుంది కదా... ఇదే కదా రియాలిటీ..ఎవరి ఇంట్లో ఐనా కూడా ఇలాంటి చతుర్లు వినిపిస్తూనే ఉంటాయి కదా. ఇక అఖిల్ సార్థక్ రెడీ అవుతున్నంత సేపు బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా ప్రేమికుల రోజు మూవీ నుంచి "నిన్ను చూసి నన్ను నేను మరిచి" అనే పాట వస్తూనే ఉంది. ఇక స్మార్ట్ గా ఉన్న అఖిల్ కి ఒక నెటిజన్ ఐతే "అర్ధం చేసుకునే మంచి అమ్మాయే నీ లైఫ్ లోకి వస్తుంది..మేము నీ కోసం ప్రార్దిస్తాం" అంటూ మెసేజ్ పెట్టారు.