English | Telugu
Rithu Chowdhar Captain: కెప్టెన్‌గా రీతూ చౌదరి.. ది వరస్ట్ సంచాలక్‌గా తనూజ!
Updated : Nov 22, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. నిన్నటి ఎపిసోడ్ లో ఇమ్మాన్యుయేల్ వాళ్ళ అమ్మ వచ్చి హౌస్ మేట్స్ తో అందరితో సరదాగా మాట్లాడింది. దాంతో ఫ్యామిలీ వీక్ ముగిసింది. ఇక ఆ తర్వాత కెప్టెన్సీ రేస్ మొదలైంది.
గార్డెన్ ఏరియాలో ఒక మాన్ స్టర్ ని ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. దానికి ఆకలి వేసినప్పుడు మీలో ఎవరు కెప్టెన్ అవ్వకూడదని అనుకుంటున్నారో వారిని బజర్ మోగిమ తర్వాత దానికి ఆహారంగా పంపించాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో రెడ్ టీమ్ వర్సెస్ బ్లూ టీమ్ సాగింది. రెడ్ టీమ్ లో ఇమ్మాన్యుయల్, భరణి, దివ్య, సంజనా ఉండగా బ్లూ టీమ్ లో పవన్ కళ్యాణ్, రీతూ చౌదరి, డీమాన్ పవన్ ఉన్నారు. సంఛాలక్ గా తనూజ ఉంది. ఇక మొదటగా రెడ్ టీమ్ నుండి సంజన కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకోగా.. ఆ తర్వాత దివ్య కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకుంది. ఇక బ్లూ టీమ్ నుండి కళ్యాణ్ తప్పుకోగా ఆ తర్వాత రెడ్ టీమ్ నుండి ఇమ్మాన్యుయల్ కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకున్నాడు. ఇలా భరణి, డీమాన్ పవన్ కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకున్నారు.
ఇక కెప్టెన్సీ రేసులో రీతూ చౌదరి, సుమన్ శెట్టి నిలిచారు. వీరిద్దరికి టాస్క్ ఇవ్వగా రీతూ చౌదరి గెలిచి ఈ వారం కెప్టెన్సీ అయింది. కెప్టెన్సీ అనేది ప్రతీ ఒక్కరి కల.. అయితే దీనిని పదకొండు వారాల తర్వాత రీతు చౌదరి సాధించింది. ఈ వారం డీమాన్ పవన్ నామినేషన్ లో ఉన్నాడు. పైగా డేంజర్ జోన్ లో ఉన్నాడు. మరి అతను ఎలిమినేషన్ అయితే రీతూ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.