English | Telugu

రుద్ర పెళ్ళి తెలుసుకొని ఇంటికి వచ్చిన మీడియా.. శకుంతల పంతం నెగ్గుతుందా!

జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -121 లో......గంగని తీసుకొని రుద్ర ఇంటికి వస్తాడు. వాళ్ళని చూసి పెద్దసారు హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళని చూసి ఇషిక, వీరు ఇద్దరు శకుంతల దగ్గరికి వెళ్లి విషయం చెప్తారు. దాంతో శకుంతల షాక్ అవుతుంది. వాళ్ళకి హారతి ఇవ్వండి అని ప్రీతీకి పెద్దసారు చెప్తాడు. అమ్మ ఏమంటుందోనని ప్రీతి భయపడుతుంది. పర్లేదు నేను చూసుకుంటానని పెద్దసారు అనగానే.. వాళ్ళకి ప్రీతి హారతి ఇస్తుంది.

అప్పుడే శకుంతల ఎంట్రీ ఇచ్చి ఆపండి అంటుంది. నాకు తెలియకుండా ఇదంతా చేస్తున్నారంటే ఏమనుకోవాలి. నాకు ఈ ఇంట్లో ఏ విలువ లేదా అని ఇంట్లో అందరిపై శకుంతల కోప్పడుతుంది. ఈ స్థాయి తక్కువ మోసగత్తే ఈ ఇంటికి కోడలు ఎలా అవుతుంది.. నేను ఒప్పుకోనని శకుంతల అంటుంది. గంగ మెడలో రుద్ర తాళి కట్టాడు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు.‌. నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అదే నిజం అని పెద్దసారు అంటాడు. నన్ను కాదని ఈ ఇంట్లోకి వస్తే నేను చచ్చినట్టే అని శకుంతల అనగానే అలా అనకు అమ్మ అని రుద్ర అంటాడు. అలా పిలవకు నా కొడుకు చావుకి కారణం అయ్యావ్ అయినా నిన్ను క్షమించాను.. ఇప్పుడు నన్ను కాదని ఒక మోసగత్తెని పెళ్లి చేసుకున్నావని శకుంతల అంటుంది.

అలా అనకు అమ్మ నువ్వు మా పెళ్లిని అంగీకరించి ఇంట్లోకి ఆహ్వానిస్తే వస్తాము.. లేదంటే ఇంట్లో నుండి బయటకు వెళ్తామని రుద్ర అనగానే అందరు షాక్ అవుతారు. ఇషికకి పారు ఫోన్ చేసి అక్కడ సిచువేషన్ ఎలా ఉందని అడుగుతుంది. అదేం లేదు శకుంతల అత్తయ్య వాళ్ళని రానివ్వడం లేదని చెప్తుంది. ఇప్పుడు రుద్రకి వేరే ఛాన్స్ లేదు గంగని వదిలెయ్యాల్సిందేనని పారు అంటుంది. అప్పుడే మీడియా వాళ్ళు అందరు రుద్ర ఇంటికి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.