English | Telugu

మీ చుట్టూ ఉన్నవాళ్ళలోనే శత్రువులున్నారు.. క్లూ ఇచ్చిన వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -905 లో.. అనుపమ తన కార్ లో రిషిని రిసార్ట్ దగ్గర డ్రాప్ చేస్తుంది. ఇది మహేంద్ర ఉండే రిసార్ట్ కదా రిషిని మహేంద్ర గురించి అడగాలా అని అనుపమ అనుకుంటుంది. కానీ రిషిని అడగదు. మళ్ళీ కలుస్తానంటు అనుపమ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొక వైపు అనుపమ రిషిని డ్రాప్ చేయడం చూసిన మహేంద్ర.. తనతో నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతాడు. దాంతో తను మీకు తెలుసా అని రిషి అడుగుతాడు. లేదని మహేంద్ర కవర్ చేస్తాడు. కాసేపటికి నేను మళ్ళీ వస్తానని చెప్పి మహేంద్ర బయటకు వెళ్తాడు.

మరొకవైపు వసుధార దగ్గరికి రిషి వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. మీకేం కాలేదు కదా అని వసుధార కంగారు పడుతుంది. అమ్మ చనిపోయి ఇన్ని రోజులు అయిన నేను నా శత్రువుల గురించి తెలుసుకోలేకపోతున్నానని రిషి అంటాడు..శైలేంద్ర సర్ మీ శత్రువులు అని నాకు తెలిసిన నేను చెప్పలేకపోతున్న సాక్ష్యం లేకుండా మీరు నమ్మరు. అందుకే సాక్ష్యంతో మీకు చూపిస్తానని వసుధార తన మనసులో అనుకుంటుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళలోనే మీ శత్రువులు ఉంటారు కనిపెట్టండని రిషికి వసుధార చెప్తుంది. మరొకవైపు అనుపమని మహేంద్ర కలుస్తాడు. ఇప్పుడు కూడా జగతిని తీసుకొని రాలేదంటే నువ్వు ఒక్కడివే వచ్చావని అర్థమవుతుంది. జగతి ఎక్కడ అని మహేంద్రని అనుపమ నిలదీస్తుంది. అయిన జగతి గురించి మహేంద్ చెప్పడు.. ఆ తర్వాత తమ జ్ఞాపకాలు గుర్తుకుచేసుకుంటారు.. మహేంద్ర వెళ్తుంటే నేను డ్రాప్ చేస్తానని మహేంద్రను రిసార్ట్ దగ్గర డ్రాప్ చేస్తుంది అనుపమ.

ఆ తర్వాత రిసార్ట్ దగ్గర డ్రాప్ చేసిన అనుపమతో మహేంద్ర మాట్లాడుతుంటాడు. అలా మాట్లాడడం వసుధార చుసి మహేంద్ర సర్ ఎవరితో మాట్లాడుతున్నాడు. తనేనా అనుపమ అని అనుకుంటుంది. కాసేపటికి రిషి, వసుధారలు డిన్నర్ చేస్తుంటే.. మహేంద్ర రాగానే రిషి పిలుస్తాడు. నాకు వద్దు, మీరు డిన్నర్ చెయ్యండని చెప్పి మహేంద్ర వెళ్లిపోతాడు ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.