English | Telugu

భార్యకి అబార్షన్ కావాలని జ్యూస్ లో ట్యాబ్లెట్స్ కలిపిచ్చిన భర్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -238 లో.. ఇంట్లో శ్రీమంతం జరుగుతుందని ఇందిరాదేవి హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. మీ సంతోషం కోసం మేం ఇది చాలా బాగా చేస్తాం. మీరు టెన్షన్ పడకండి అని ఇందిరాదేవితో అపర్ణ చెప్తుంది. మరొకవైపు వాళ్ళు సంతోషం గా ఉండడం చూసిన కావ్య.. ఇంత మందిని స్వప్న మోసం చేస్తుందని అనుకుంటుంది.

మరొక వైపు స్వప్నకి అబర్షన్ కావడానికి రుద్రాణి టాబ్లెట్స్ తీసుకొని వచ్చి రాహుల్ కి ఇస్తుంది. ఈ టాబ్లెట్స్ స్వప్న తాగే జ్యూస్ లో కలిపి ఇవ్వమని రుద్రాణి చెప్పగానే రాహుల్ సరే అంటాడు. మరొక వైపు కావ్య స్వప్న చెప్పిన అబద్దపు కడుపు గురించి బాధపడుతుంది. అక్క కాపురం నిలబెట్టాలా లేక అందరికీ సంతోషం దూరం చెయ్యాలా అని కావ్య బాధపడుతుంది. మరొక వైపు అనామిక వాళ్ళ ఇంట్లో వంట చేస్తుంటాడు కళ్యాణ్. అప్పుడే అప్పు వచ్చి నువ్వు వంట చేస్తున్నావా అని అడుగుతుంది.. అనామిక వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేరు, అనామికకి వంట రాదు నాక్కూడా రాదు.. నీ హెల్ప్ తీసుకుందామని నిన్ను రమ్మన్నానని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ చేసిన వంట తిని అనామిక బాలేదని అంటుంది. ఎందుకు చేసిన వాళ్లని అలా అంటూన్నవని అప్పు అడుగుతుంది. నిజం చెప్పాలి అప్పుడే కదా తెలిసేదని అనామిక అంటుంది. అవును అలాగే నిజం చెప్పాలని కళ్యాణ్ అంటాడు. వీడికి లవ్ అంటే తెలియదు.. దీనికి వాడుకోవడం తప్ప ఏం తెలియదని అప్పు అనుకుంటుంది. మరొక వైపు రాహుల్ జ్యూస్ లో టాబ్లెట్స్ కలిపి తీసుకొని స్వప్న దగ్గరికి వస్తాడు. స్వప్న తాగనని అనగానే.. అప్పుడే కనకం వచ్చి రాహుల్ అంత ప్రేమగా తీసుకొని వచ్చినప్పుడు తాగాలని బలవంతంగా జ్యూస్ తాగిస్తుంది.

మరొక వైపు రాజ్ కి తలనొప్పిగా ఉందని అనడడంతో కావ్య జండు బామ్ రాస్తుంది. ఆ తర్వాత రాజ్ ఫోన్ కోసం వెతుకుతుండగా కావ్య నడుముకి రాజ్ చెయ్యి తగులుతుంది. దాంతో కావ్య లేచి.. మీరు మళ్ళీ నా నడుముని టచ్ చేశారని చెప్తుంది. మరొక వైపు స్వప్నకి ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తుంది కావచ్చని రాహుల్ తననే చూస్తూ ఉంటాడు. ఏమైనా అనిపిస్తుందా అని రాహుల్ స్వప్నని నిద్రలేపి అడుగుతాడు. దాంతో స్వప్న చిరాకు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..