English | Telugu

ఏంజిల్ ఎవరిని ప్రేమిస్తుందో చెప్పేసిన విశ్వనాథ్.. షాక్ లో రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -861 లో.. వసుధార దగ్గరికి విశ్వనాథ్ వస్తాడు. ఎన్నడూ లేనిది సర్ ఇక్కడికి ఎందుకు వచ్చారని వసుధార, చక్రపాణి ఇద్దరు అనుకుంటారు. విశ్వనాథ్ వచ్చి.. నీతో ఏంజిల్ ఫోన్ మాట్లాడడం నేను విన్నాను. ఏంజిల్ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, నీకు తెలుసు కదా ఎవరతను అని వసుధారని విశ్వనాథ్ అడుగుతాడు. వసుధార ఇబ్బందిపడుతు రిషి సర్ అని చెప్తుంది.

ఆ మాట విని విశ్వనాథ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొక వైపు చక్రపాణి బాధపడుతాడు. ఆ తర్వాత మీరు రిషి మనసులో ఏం ఉందనేది మీరు కనుక్కోండని చక్రపాణితో విశ్వనాథ్ అనగానే.. నేను అలా చెయ్యలేను అలా అడగడం కరెక్ట్ కాదని చక్రపాణి అంటాడు. ఆ తర్వాత విశ్వనాథ్ వెళ్ళిపోయాక చక్రపాణి ఎమోషనల్ అవుతాడు. తన తండ్రికి బాధపడవద్దని వసుధార అంటుంది. రిషి సార్ నిజం తెలుసుకుంటాడు మేమిద్దరం ఒకటి అవుతామని వసుధార చెప్తుంది. మరొక వైపు మిషన్ ఎడ్యుకేషన్ గురించి అందరూ వీడియో కాన్ఫరెన్స్ లో డిస్కషన్ చేసుకుంటారు. మీటింగ్ లో జగతి, మహేంద్రణ రిషి, వసుధార ఇంక స్టూడెంట్స్ ఉంటారు. మీటింగ్ లో వసుధార డల్ గా కనిపిస్తుంది. వసుధారని రిషి చూస్తూ .. అసలు వసుధారకి ఏమైంది ఎందుకు అలా ఉందని అనుకుంటాడు. ఆ తర్వాత మీటింగ్ ఏర్పాటు చెయ్యండని రిషి చెప్తాడు. ఆ తర్వాత వసుధారని తన క్యాబిన్ కి రమ్మని రిషి చెప్తాడు. మరొక వైపు జగతి, మహేంద్ర ఇద్దరు రిషిని ఇలా వీడియో కాల్ లో చూసి సంతోషపడే పరిస్థితి వచ్చిందని జగతి. ఎమోషనల్ అవుతుంది మెల్లిగా బావగారు కూడా శైలేంద్ర వైపు మారిపోతున్నారని మహేంద్రతో జగతి చెప్తుంది. నువ్వేం టెన్షన్ పడకుమని మహేంద్ర చెప్తాడు. వాళ్ళ మాటలన్ని శైలేంద్ర దేవయాని ఇద్దరు వింటారు. మరొక వైపు రిషి, వసుధార మాట్లాడుకుంటారు‌. ఏమైంది ఎందుకు అలా ఉన్నావని రిషి అడుగుతాడు. వసుధార మాత్రం విశ్వనాథ్ తన దగ్గరికి వచ్చిన విషయం రిషికి చెప్పదు.

మరొక వైపు రిషి, ఏంజెల్ తో ఎందుకు పెళ్లి వద్దంటున్నాడని విశ్వనాథ్ ఆలోచిస్తాడు. రిషిని తన గదిలోకి పిలిపించుకొని.. ఏంజిల్ ప్రేమిస్తుంది ఎవరినో తెలిసిపోయింది. అది నువ్వే అని రిషి చెయ్యి పట్టుకుంటాడు విశ్వనాథ్. అది విని రిషి షాక్ అవుతూ తన చెయ్యిని తీసేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..