English | Telugu
అనామిక గదిలో కళ్యాణ్ కవితలు.. కావ్య టెన్షన్!
Updated : Sep 6, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -194 లో.. కావ్య ఇంటి ముందు ముగ్గు వేస్తు ఉంటుంది. రాజ్ ఫోన్ మాట్లాడుతూ చూడకుండా ముగ్గుని తొక్కుతాడు. కావ్య గట్టిగా అరుస్తుంది. ఎందుకు అలా అరుస్తూన్నావ్? నువ్వు వేసే తొక్కలో ముగ్గంటూ కావ్యని రాజ్ అంటాడు. అప్పుడే అటుగా వస్తున్న సీతరామయ్యని చూసి నీ ముగ్గు బాగుంది కావ్య అంటూ మెచ్చుకుంటాడు. అది చూసి సీతరామయ్య సంతోషపడతాడు.
ఆ తర్వాత ముగ్గు అంటే ఇలా వేయాలి. మా అమ్మ వేస్తుంది, ఏం బాగా వెయ్యదని రాజ్ అంటాడు. ఆ మాట అపర్ణ రుద్రాణి వింటుంది. ఆ తర్వాత ఈ కావ్యని పొగడాలంటే మా అమ్మని తక్కువ చేసి మాట్లాడాలా అని తనను తాను తిట్టుకుంటాడు రాజ్. ఆ తర్వాత రుద్రాణి.. చూసావా వదిన పెళ్ళాం బెల్లంణ తల్లి అల్లం. ఏంటి ఈ గొళ్ళెమంటూ అపర్ణతో వెటకారంగా అంటుంది. మరొకవైపు అప్పు, కళ్యాణ్ లు కలిసి బయటకు వెళ్తారు. అక్కడ ఒక అమ్మాయి కార్ తో వచ్చి కళ్యాణ్ , అప్పు లు వెళ్తున్న బైక్ కి తాకిస్తుంది. ఆ తర్వాత అప్పు కోపంగా వెళ్లి ఆ అమ్మయిని తిడుతుంది. తీరా చూస్తే కార్ లో ఉన్న అమ్మయి అనామిక. తనని చూసిన కళ్యాణ్.. తిట్టకు అప్పు, తను అనామిక అని అప్పుకి పరిచయం చేస్తాడు. నిన్ను ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్తానని కళ్యాణ్ కి అనామిక చెప్తుంది. సరే అని అప్పుని వదిలేసి అనామికతో కలిసి వెళ్తాడు కళ్యాణ్. మరొక వైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తు టిఫిన్ కోసం కావ్యని పిలుస్తాడు. ఇంకా రెడీ కాలేదని కావ్య చెప్తుంది. నువ్వు వెళ్ళు రాజ్, కావ్య ఆఫీస్ కి టిఫిన్ తీసుకొని వస్తుందని సీతరామయ్య చెప్తాడు.. సరే అని రాజ్ అంటాడు. అలా కావ్య పై రాజ్ పాజిటివ్ గా ఉండడం చూసిన అపర్ణకి కోపం వస్తుంది. మరొక వైపు కళ్యాణ్ ని అనామిక తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంట్లో వాళ్లకి కళ్యాణ్ ని పరిచయం చేసి తన గదిని చూపిస్తుంది. తన గదిలో కళ్యాణ్ రాసిన కవితలు గోడకి ఫ్రేమ్ తో ఉండడం చూసిన కళ్యాణ్ .. నేను రాసిన కవితలంటే ఇంత ఇష్టమా అని అనుకుంటాడు. ఆ తర్వాత అనామిక కళ్యాణ్ ఫోటోని తనకి కన్పించకుండా జాగ్రత్తపడుతుంది.
మరొక వైపు అందరూ హాల్లో కూర్చొని ఉండగా.. రాహుల్ స్వప్న ఇద్దరు ఎక్కడ కన్పించడం లేదని రుద్రాణిని ఇందిరాదేవి అడుగుతుంది. వాళ్ళు హనీమూన్ అని పది రోజులు ఎక్కడికో వెళ్లారు. ఎక్కడికి వెళ్లారో తెలియదని రుద్రాణి అనగానే.. అంత నిర్లక్ష్యం ఎందుకు? వెంటనే కాల్ చేసి వెనక్కి రమ్మని చెప్పమని ఇందిరాదేవి అనగానే రాహుల్ కి రుద్రాణి ఫోన్ చేస్తే ఫోన్ స్విచాఫ్ వస్తుంది. ఆ తర్వాత స్వప్న రాహుల్ ఎక్కడికి వెళ్లారని కావ్య టెన్షన్ పడుతుంటే.. ధాన్యలక్ష్మి వచ్చి నువ్వు టెన్షన్ పడకు. వాళ్ళ గురించి అలోచించకు. ముందు నువ్వు రాజ్ కి క్యారేజ్ తీసుకొని వెళ్ళు అనగానే కావ్య సరే అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.