English | Telugu

వసుధార ఇచ్చిన క్లూతో సారథిని రిషి పట్టుకోగలడా?


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -891లో.. నేను కాలేజీలో అడుగుపెట్టలేనని రిషి అనగానే.. మీరు కాలేజీలో జరిగిన విషయాలన్ని మనసులో పెట్టుకోకండని చెప్తుంది వసుధార. మీ మీద పడ్డ నింద అబద్ధమని SI కి మంత్రి గారికి చెప్పానని వసుధార అనగానే దేవయాని శైలేంద్ర ఇద్దరు షాక్ అవుతారు. అది అబద్ధమని నాకు తెలుసు కానీ కారణం ఎవరో తెలియాలని రిషి అంటాడు.

ఆ తర్వాత దానికి కారణం కూడ చెప్పాను సర్ అని వసుధార చెప్తుంది. అలా వసు అనగానే రిషి ఆశ్చర్యపోతాడు. జగతి మేడమ్ ఆ రోజు నాతో అబద్ధం చెప్పమని చెప్పారు. ఆ రోజు అలా అబద్ధం చెప్తేనే రిషి ప్రాణాలతో ఉంటాడని జగతి మేడమ్ ని ఎవరో భయపెట్టారు. అందుకే మేడమ్ అలా చేశారు. ఇప్పటివరకు మీపై జరిగిన అన్ని అటాక్ లు మేడమ్ ని భయపెట్టాడానికి చేసినవే సర్ అందుకే జగతి మేడమ్ అంత భయపడ్డారని వసుధార చెప్తుంది. ఎవరు మా అమ్మని భయపెట్టిందని తెలుసుకోవాలని రిషి అంటాడు..

తెలుసుకోవచ్చు సర్ శైలేంద్ర సర్ సపోర్ట్ చేస్తే అని అనగానే.. అందరూ షాక్ అవుతారు. ఎలా అని రిషి అడుగుతాడు. సారథి చెక్కు కాలేజీ లో ఇవ్వకుండా డైరెక్ట్ వెళ్లి మినిస్టర్ గారికి ఎందుకిచ్చాడు. సారథిని పట్టుకుంటే తెలుస్తుంది కదా.. అసలు మేడమ్ ని భయపెట్టింది కూడా అతనే కావచ్చని వసుధార అనగానే.. అవును అన్నయ్య వెంటనే సారథిని రమ్మను అని రిషి చెప్తాడు. దానికి శైలేంద్ర ఇబ్బందిగా సరే అంటాడు.

మరొకవైపు మహేంద్ర జగతి జ్ఞాపకాలతో పిచ్చివాడు అవుతాడు. తాగి కిందకి వస్తు పడిపోతుంటే రిషి పట్టుకుంటాడు. ఆ తర్వాత మహేంద్ర తన బాధని చెప్పుకుంటాడు. మరొక వైపు వసుధార మాటలకు దేవయాని టెన్షన్ పడుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. సారథిని ఇక్కడ నుండి పంపించేశానని శైలేంద్ర చెప్తాడు. మరొక వైపు మినిస్టర్ వచ్చి జగతి గురించి బాధపడుతాడు. త్వరలోనే జగతిని ఎవరు బయపెట్టారో కనుక్కోవాలని చెప్తాడు. కాసేపటికి రిషిని ఎండీగా బాధ్యతలు తీసుకోమని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..