English | Telugu

రిషిధార అంటే కేవలం పేరు కాదు ఒక ఎమోషన్


స్టార్ మా వచ్చే "గుప్పెడంత మనసు" సీరియల్ కి వీరాభిమానులు చాల మంది ఉన్నారు. అందులో జగతి, మహేంద్ర, రిషి, వసుధార పాజిటివ్ రోల్స్ లో కనిపిస్తే దేవయాని పెద్దమ్మ, శైలేంద్ర అన్నయ్య విలన్ రోల్స్ లో కనిపిస్తారు. ఇక జగతిని, రిషిని అభిమానించే రోల్ లో ధరణి ఉంటుంది. మొత్తం ఈ రోల్స్ మధ్య సక్సెస్ ఫుల్ రన్ అవుతున్న సీరియల్ ఇది.

ఇక ఈ సీరియల్ లో వసుధార-రిషిని కలిపి "రిషిధార" అని పిలుస్తాడు మహేంద్ర సర్. ఐతే మహేంద్ర అలియాస్ సాయికిరణ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో రీసెంట్ గా పోస్ట్ చేసాడు. అందులో "జగతి.. ఈ రిషిధార కనిపించట్లేదేంటి" అంటూ అడుగుతుండగా "ఏమన్నారు డాడ్" అంటూ రిషి ఎంట్రీ ఇచ్చేసరికి మహేంద్ర, జగతి స్టన్ ఐపోతారు. ఐతే ఈ బిట్ సీరియల్ లో జగతి ఉన్నప్పటిది.

ఐతే ఈ బిట్ ని రిపీట్ పోస్ట్ చేసి ఫ్యాన్స్ కామెంట్స్ లో పెట్టె 'రిషిధార' అనే పదాన్ని నేనే ఫస్ట్ టైం సీరియల్‌లో పిలిచాను" అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇకపోతే ఇప్పుడు జగతి రోల్ ని చంపేసి ఆడియన్స్ ని హర్ట్ చేశారు సీరియల్ డైరెక్టర్. ఇక మహేంద్ర జగతితో ఫోటో తీసి ఆ పిక్ ని కూడా పోస్ట్ చేసుకుని "సో లాంగ్ జగ్గు" అని కామెంట్ పెట్టుకున్నారు.

ఇక జగతి రోల్ కి శుభం కార్డు పడేసరికి బయట ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. హాట్ ఫోటో షూట్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ యూత్ ని పిచ్చెక్కిస్తోంది. రీసెంట్ గా ఆమె నటించిన'ప్రెట్టీ గర్ల్' అనే వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. "జగతి- మహేంద్ర కాంబినేషన్ ని చాల మిస్ అవుతున్నాం. ఐ మిస్ యు జగతి మేడం..జగతి- మహేంద్ర ఫన్నీ కాంబో..రిషిధార అంటే కేవలం పేరు కాదు ఒక ఎమోషన్" అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..