English | Telugu

జబర్దస్త్ లో కొత్త డైరెక్టర్లు, కొత్త యాంకర్లు, కొత్త టీములు

జబర్దస్త్ లో లేటెస్ట్ అప్ డేట్స్ గురించి తెలియాలంటే హైపర్ ఆది స్కిట్ చూస్తే తెలిసిపోతుంది. ఇక ఈ వారం జబర్దస్త్ కొత్త ఎపిసోడ్ లో రాఘవ స్కిట్, హైపర్ ఆది స్కిట్ బాగా పేలాయి. ఇక హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ స్కిట్ లో భాగంగా స్టేజి మీదకు వచ్చి ఆది.."జబర్దస్త్ విశేషాలు ఏమిటి అని రాంప్రసాద్ అడగడం...ఏముంది.. డైరెక్టర్ మారాడు..యాంకర్ మారింది...టీములు మారాయి...ఇక మారాల్సింది నువ్వూ నేనే " అన్నాడు. వీళ్ళ కామెంట్స్ వింటే మాత్రం ఇతర షోస్ కి పోటీగా జబర్దస్త్ లో కూడా చాలానే మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్న విషయం అర్ధమైపోతుంది.

"మరి మీ కొత్త లీడర్ వచ్చాడు కదా అతని ముఖ చిత్రం ఏమిటి" అని రాంప్రసాద్ అడిగేసరికి "ఎన్నాళ్లకు వచ్చిందనే ఆనందం ఒక పక్కన, ఎన్నాళ్ళు ఉంటుంది అనే ఒక బాధ " అని ఆది అనేసరికి స్టేజి మొత్తం నవ్వులు విరిశాయి. "ఏదైమైనా జబర్దస్త్ స్టార్టింగ్ లో ఎలాంటి గ్లామర్ తో వచ్చావో ఆ గ్లామర్ నే మెయింటైన్ చేస్తున్నావ్ " అని ఆది అనేసరికి "గ్లామర్ మెయింటైన్ చేయడం ఒక ఆర్ట్" అని రాంప్రసాద్ ఒక రేంజ్ లో ఆన్సర్ ఇచ్చాడు. "అవునులే గ్లామర్ ఉంటది మరి వదినకు తెలియకుండా ఎన్ని మెయింటైన్ చేస్తున్నావో మరి" అని ఆది రివర్స్ కౌంటర్ వేశారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.