English | Telugu
ఏ 'దివి'లో విరిసిన పారిజాతమో
Updated : Mar 2, 2024
బిగ్ బాస్ కారణంగా ఫేమస్ ఐన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆడియన్స్ కి తెలియని వాళ్ళు కూడా బుల్లితెర షోస్ ద్వారా లైంలైట్ లోకి వచ్చారు. అలాంటి వాళ్ళల్లో దివి ఒకటి. అందాల కళ్ళతో మత్తెక్కిస్తూ ఉంటుంది. ఆమె కొన్ని మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ చేసింది కానీ అనుకున్నంత పేరు రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. మహేష్ బాబు మూవీ మహర్షితో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దివి మోడలింగ్ నుంచి మూవీస్ లోకి వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో మంచి గేమ్ తో అందరినీ ఆకట్టుకుంది. అలాంటి దివి ఇన్స్టాగ్రామ్ లో మంచి మంచి ఫోజులతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా అలాంటి కిక్కెక్కించే ఒక పిక్ ని పోస్ట్ చేసింది. రెడ్ శారీతో ఉన్న ఆ పిక్ ని చూసి నెటిజన్స్ ఫిదా ఐపోతున్నారు.
ఇక ఆ పిక్ కి కాప్షన్ రొమాంటిక్ గా పెట్టింది. "అలిగితే ఇలాగే ఉంటారు మరి...ఐనా అలిగేలా చెయ్యడం దేనికి ? మళ్ళీ ఇన్ని మాటలు చెప్పడం దేనికి" అంటూ కొంటె కళ్ళతో అడుగుతోంది. ఇక నెటిజన్స్ మాములుగా ఊరుకుంటారా.." అందం ఇంత అందంగా వుంటుంది అని నిన్ను చూసాకే అనిపించింది.. అలకలో కూడా అందంగానే ఉంటుంది అని ఇప్పుడే తెలిసింది.. అచ్చ తెలుగు అమ్మాయికి చీర కట్టు, నుదుటిన బొట్టు, కళ్లకి కాటుక, పాదాలకు పట్టీలు, చేతికి గాజులు, ఎలా అయితే అందాన్ని పెంచుతాయి అలానే అలక కూడా.. అందానికి అభినయం తోడైనట్లు లక్షణంగా కనిపిస్తున్నావ్ .. దిష్టి తీయించుకో...ఇంత సూపర్ గా ఉన్నావ్ కదా మరి ఎందుకు మూవీ ఆఫర్స్ రావడం లేదో అర్ధం కాదు...అలా చూసి చంపకండి..నిన్నిక పొగడమంటే భాషకు శ్వాస ఆగిపోతుంది...ఏ దివిలో విరిసిన పారిజాతమో" అంటూ కామెంట్స్ ని పెడుతున్నారు. ఏదేమైనా దివి మాత్రం మంచి హాట్ పిక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.