English | Telugu

అనుపమ‌ గురించి ఎంక్వైరీ చేయమన్న దేవయాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -908 లో.. ఒకదాని తర్వాత ఒకటి ఎటాక్స్ జరుగుతున్నాయని, వెంటనే వెళ్ళిపోండని అనుపమ అనగానే.. మహేంద్ర సరేనంటాడు. రిషి, వసుధారలని అడుగగా.. అడుగడుగున ఇంత ప్రమాదం పొంచి ఉంటే ఎందుకు ఇక్కడ ఉండటం, మీరు ప్రశాంతంగా ఉండాలని తీసుకొచ్చామని వసుధార అంటుంది. ఇంతకీ మీ పేరు చెప్పలేదని వసుధార అడుగుగా.. అనుపమ అని అంటుంది. అది విని వసుధార, రిషి ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అరకు నుండి ఇంటికి వచ్చేస్తారు.

ఇంటికి రాగానే అరకులో తనపై ఎటాక్ చేసిందెవరని ఆలోచిస్తుంటాడు రిషి. ఎందుకు మనల్ని ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని రిషి అనగా.. ఎవరో మన చుట్టూ ఉండి ఇది చేస్తున్నారని వసుధార అంటుంది. ఎటాక్ జరిగిన రెండుసార్లు అనుపమ కాపాడిందని రిషి అంటాడు.

అసలు తను ఎవరని రిషిని వసుధార అడుగుతుంది. మనకి కావాల్సిన శ్రేయోభిలాషిలా ఉందని రిషి అనగా.. అవును సర్, అరకులో ఒక రాయి మీద జగతి, అనుపమ, మహేంద్ర అని రాసి ఉందని వసుధార అంటుంది. మరి నాకెందుకు చెప్పలేదని అనగా.. మహేంద్ర సర్ ని రెసార్ట్ దగ్గర డ్రాప్ చేసిందని వసుధార అనగానే.. నాన్న రిషీ అంటూ మహేంద్ర వస్తాడు. ఇక రిషి, వసుధార ఇద్దరు మహేంద్ర విన్నాడేమోనని టెన్షన్ పడతారు. నీ మీద ఎటాక్ చేసినవాళ్ళని పట్టుకోవాలని, జగతిని చంపినవారికి, వీళ్ళకి మధ్య ఏమైన సంబంధం ఉందా కనుక్కోవాలని రిషితో మహేంద్ర చెప్పేసి వెళ్తాడు. ఇక మరొకవైపు శైలేంద్ర, దేవయాని మాట్లాడుకుంటారు.

నా ఆలోచనలు,‌నా ఆశయాలన్నీ ఆ ఎండీ సీట్ కోసమే అని శైలేంద్ర అనగానే.. అది జరగదని దేవయాని అంటుంది. అదేంటమ్మా అలా అంటున్నావని శైలేంద్ర అంటాడు. వాళ్ళు అరకు వెళ్లి మళ్ళీ వచ్చారు. మనం మాత్రం ఏం చేయలేదని దేవయాని అంటుంది. ఎండీ సీట్ దక్కించుకోవడం నీ వల్ల కాదు. ఫారెన్ వెళ్లిపోమని దేవయాని అంటుంది. నీ ఆలోచనలు కీ రీల్ ప్లే చేస్తాయని శైలేంద్ర అంటాడు‌. చివరికి జగతి ప్రాణం పోయిన, ఫలితం మనకి దక్కట్లేదని దేవయాని అనగా.. నువ్వే చెప్పావ్ కదా అమ్మ, సహనంగా ఉండాలి, గట్టి నమ్మకంగా ఉండాలని శైలేంద్ర అంటాడు. ఇక బ్యాలెన్స్ గా కొన్ని ప్రాణాలు ఉన్నాయి. ఇక అవి కూడా పోయాయనుకో అని శైలేంద్రతో దేవయాని అనగానే.. దేవయాని అంటూ పణీంద్ర వస్తాడు. " ఎవరి ప్రాణాల గురించి? చెప్పు దేవయాని? అసలేం జరుగుతుంది శైలేంద్ర? మీ మాటలు వింటుంటే నాకు భయమేస్తుంది" అని ఫణీంద్ర నిలదీస్తాడు. ఇక అప్పుడే నేను చెప్తాను మామయ్య గారు అని ధరణి వస్తుంది. తన ప్రాణాలు ఎవరు తీసారో ఏంటో వాళ్ళు దొరికితే బాగుండు. ఎలాగైనా వాళ్లని దొరకబట్టి తగిన శిక్ష వేయాలని మాట్లాడుకుంటుమ్నారని ధరణి అంటుంది. అవునా అని ఫణింద్ర అనగానే.. అవును తల్చుకొని బాధపడుతున్నాని దేవయాని అంటుంది. ఇక నీ నాటకాలు ఆపుతావా? జగతిని తల్చుకోకని దేవయానితో ఫణీంద్ర అంటాడు. ఈ తల్లికొడుకులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదని ధరణితో ఫణీంద్ర అంటాడు. అనుపమ గురించి ఎంక్వైరీ చేయమని శైలేంద్రతో చెప్తుంది దేవయాని.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.