English | Telugu
ముకుంద పంతం గెలుస్తుందా.. కృష్ణ బంధం నిలుస్తుందా?
Updated : Nov 1, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ - 302 లో.. కృష్ణని పాతబడిన ఆ స్టోర్ రూమ్ లో ఉండమని భవాని ఇంటినుండి పంపిచేస్తుంది. ఇక ఆ రూమ్ కి వెళ్తున్న కృష్ణ దగ్గరికి ముకుంద వచ్చి సవాలు విసురుతుంది.
నేను మురారిని ప్రేమిస్తున్నట్లు చెప్పాను. ఆదర్శ్ రాడని కమాండర్ తో ఆడించిన డ్రామాలో చెప్పానని ముకుంద అనగానే.. నువ్వు నన్ను చూసి భయపడుతున్నావ్ ముకుంద అని కృష్ణ అంటుంది. దేశంలో చాలా మంది డాక్టర్లున్నారు. ఇక నువ్వు దయచేయొచ్చని ముకుంద అనగా.. అవును నిజమే కానీ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా నేనొక్కదాన్నే భార్యనని కృష్ణ అంటుంది. ఇన్ని అవమానాలు జరిగిన ఇంత ధైర్యంగా ఎలా మట్లాడుతుంది. నేనేంటి ఉండలేకపోతున్నానని ముకుంద అనుకుంటుంది. ఇక మురారి గదిలో ఉన్న మధు ఆలోచిస్తుంటాడు.
మురారి కోసం కృష్ణ ఆలోచిస్తుంటుంది కానీ పెద్దమ్మ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిందని అపార్థం చేసుకుంటుంది. ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో ఏమో అని మధు అనుకుంటాడు. ఇక హాల్లో కూర్చున్న భవాని దగ్గరికి మురారి వెళ్తాడు. ఎలా ఉంది నాన్న అని భవాని అనగానే.. పర్లేదని మురారి అంటాడు. ఆ తర్వాత ముకుంద ఏదని మురారి అడుగగా.. కాఫీ తీసుకురావడానికి వెళ్ళిందని భవాని చెప్తుంది. ఆ తర్వాత రేవతి వచ్చి.. నీకిష్టమని గుత్తి వంకాయ కూర చేశానని అంటుంది. ఇక డౌట్ తో ఆ కూర అంటే నాకిష్టమా అని మురారి అంటాడు. ఇక గతం గుర్తురాకుండా చూసుకోమని డాక్టర్ చెప్పారు కదా అని భావించిన భవానీ.. ఇకనుండి మురారికి ఇష్టమైనవే మనం తిందామని టాపిక్ డైవర్ట్ చేస్తుంది.
ఆ తర్వాత మురారికి తన గదిని చూపించి.. అదే నీ గది అని ముకుంద చెప్తుంది. మురారి వెళ్ళిపోతాడు. ఇక అది విన్న రేవతి .. నీ గది ఎందుకు చూపించావని సీరియస్ అవుతుంది. గతం గుర్తురాకుండా ఉండటానికే చేశానని ముకుంద కవర్ చేస్తుంది. ఇక స్టోర్ రూమ్ లో ఉన్న సామన్లని చూసి.. అమ్మో ఇందులో మనుషులెలా ఉంటారని ఆలోచిస్తుంటుంది. నేనిప్పుడు రెండు విషయాలను చేయాలి. ఒకటి మురారికి మెల్లమెల్లగా గతం గుర్తుచేయాలి. రెండవది చిన్నాన్నని ఎలాగైనా బయటకు తీసుకురావాలని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత మధు వస్తాడు. ఏంటి కృష్ణ భాదపడుతున్నావా అంటే.. నాకెందుకు బాధ అని అంటుంది. ముకుంద చెప్తేనే నిన్ను భవాని పెద్దమ్మ పోలీసులకి అప్పగించాలని చూసిందని మధు అంటాడు. ఓహో నా గురించి ఆ రేంజ్ లా చెప్పిందా అని కృష్ణ అనుకుంటుంది. ఇక కాసేపటికి ముకుంద వచ్చి కృష్ణ చేసే పనులని చూసి ఆటపట్టిస్తుంది. అప్పుడే మురారి వచ్చి.. మీ డాక్టర్ మేడమ్ లేదా అని కృష్ణని అంటాడు. ఇక బూజు దులుపుతున్న కృష్ణ.. మొహం మీద కప్పుకున్న చీరని అడ్డు తీస్తుంది. కృష్ణని చూసిన మురారి.. అయ్యో సారీ ఎవరో సర్వెంట్ అనుకున్నానని అంటాడు. ఆ తర్వాత మురారి హెల్ప్ చేస్తానని అన్నీ సర్దుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.