English | Telugu

శ్రీమంతపు వేడుకలో కోడలి భాగోతాన్ని అత్త బయటపెట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-241 లో.. దుగ్గిరాల ఇంటివాళ్ళు స్వప్న శ్రీమంతానికి ఏర్పాట్లు చేస్తారు. ఇక ఆ ఫంక్షన్ కి బంధువులంతా వస్తారు. కళ్యాణ్ ప్రేమించిన అనామిక కూడా వస్తుంది.

ఇక అదే సమయంలో రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ వేసుకోమని కొత్త డ్రెస్ ఇస్తుంది. రాజ్ భార్య కావ్య కూడా కొత్త డ్రెస్ సెలెక్ట్ చేసి ఇస్తుంది. ముందుగా కావ్య కొత్త చీర కట్టుకొని రాగానే రాజ్ ఫిధా అవుతాడు. ఇక తననే చూస్తుంటాడు. కొత్త చీరలో నువ్వు బాగున్నావని కావ్యతో రాజ్ అంటాడు. ఇక రాజ్ ని ఫోన్ లో ఫోటో తీయమని కావ్య చెప్తుంది. రాజ్ ఫోటో బాగుండేలా తీయడంతో.. అది చూసిన కావ్య బాగా తీసావని చెప్తుంది. ఆ తర్వాత రాజ్ గదిలోకి వెళ్ళి వాళ్ళ అమ్మ ఇచ్చిన డ్రెస్ కాకుండా కావ్య ఇచ్చిన డ్రెస్ వేసుకుంటాడు. బయటకొచ్చిన రాజ్ ని చూసిన థాంక్స్ అని చెప్తుంది. రాజ్, కావ్య కొత్త బట్టలతో ఇద్దరు మేడమీద నుండి దిగుతుంటే ఇంట్లో వాళ్ళంతా చూసి బాగున్నారని అంటారు. మీరిద్దరు 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' లా ఉన్నారని అక్కడే ఉన్న అనామిక రాజ్, కావ్యలకి చెప్తుంది. స్వప్నని ఇందిరా దేవీ, కనకం కలిసి కుర్చీలో కూర్చొబెట్టి శ్రీమంతం వేడుకని మొదలుపెడతారు. అందరు ఒక్కొక్కరుగా వచ్చి పసుపు, చందనం రాస్తుంటారు.

మరొకవైపు రుద్రాణికి స్వప్న మీద డౌట్ తో.. స్వప్న రిపోర్ట్ లని వాళ్ళకి తెలిసిన డాక్టర్ కి పంపిస్తుంది. ఆమె ఆ రిపోర్టులని చూసి.. స్వప్న తెలివిగా లేని కడుపుని నటింస్తుందని రుద్రాణితో చెప్తుంది. దాంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిన రుద్రాణి ఎలాగైనా స్వప్న బండారం బయటపెట్టాలనుకుంటుంది. అప్పుడే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి రుద్రాణిని పిలిచి స్వప్నని ఆశీర్వాదించమని చెప్పగా.. వెళ్లి ఆశీర్వదించి వస్తుంది.

ఆ తర్వాత బయటకొచ్చిన రుద్రాణి, రాహుల్ గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటారు. స్వప్న ప్రెగ్నెంట్ కాదనే విషయం రాహుల్ కి చెప్పగానే షాక్ అయిన రాహుల్.. పదా మమ్మీ అందరి ముందు అడుగుదామని అంటాడు. దానికి రాహుల్ ని రుద్రాణి ఆపి.. మనం చెప్తే ఎవరు నమ్మరని, ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తే నమ్ముతుందని అంటుంది. ఎవరు వాళ్ళు అని రాహుల్ అనగా.. స్వప్న ప్రెగ్నెంట్ అని చెప్పిన తన ఫ్రెండ్ రియా అంటుంది‌. ఆ తర్వాత రియాకి రుద్రాణి కాల్ చేసి.. మీ ఫ్రెండ్ అత్తయ్యని మాట్లాడుతున్నాని చెప్తుంది. నువ్వు ఫేక్ రిపోర్ట్స్ ఇచ్చిన సంగతి బయట తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని రియాని బెదిరిస్తుంది రుద్రాణి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.