English | Telugu
వసు పక్కన రిషిని తప్ప ఎవరినీ ఊహించుకోలేం...ఏమనుకోకండి
Updated : Mar 12, 2024
గుప్పెడంత మనసు సీరియల్ లంచ్ టైంలో అందరూ కలిసి హ్యాపీగా భోజనం చేశారు. ఈ వీడియోని రవిశంకర్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. రవిశంకర్, నవభారత్ బాలాజీ, సురేష్ బాబు ముగ్గురూ కలిసి మంచి లంచ్ ని ఎంజాయ్ చేశారు. ఎందుకు అంటే సురేష్ బాబు బొమ్మిడాయిల పులుసు విత్ మావిడికాయను అందరి కోసం తేవడంతో వాళ్లంతా కూడా తిని సూపర్ టేస్ట్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఐతే దొరికిందే సందు అని బోల్డు కామెంట్స్ ని గుమ్మరించారు.
"శైలేంద్రతో గొడవపడి మళ్లీ కలిసి తింటున్నారా...రవి మీ హెయిర్ స్టైల్ మార్చండి, పక్కపాపిడి తియ్యకండి. పైకి దువ్వండి బావుంటారు . స్టైలిష్ గా ఉంటారు... మీరు ఇలా కలిసి భోజనం చేయడం చాలా బాగుంది...సార్ మీ యాక్టింగ్ చాలా బాగుంది కానీ మా వసు పక్కన రిషిని తప్ప వేరొకరిని ఉహించుకోలేము.. ఇది మీ మీద కోపం కాదు మూడేళ్ళ నుండి రిషిధార మీద మేము పెంచుకున్న ప్రేమ.. మీకు అది ఒక ప్రాజెక్ట్ కావచ్చు కాని మాకది ఒక భావోద్వేగం. నా మాటలు మిమ్మల్ని బాధించి ఉంటె క్షమించండి కానీ ఇది నా అభిప్రాయం..."అంటూ రిషి సర్ ఎప్పుడొస్తాడు, సర్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాం అని అడుగుతున్నారు. ఇక బుల్లితెర మీద కార్తీక దీపం సీరియల్ తర్వాత అంత మంచి పేరు తెచ్చుకున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఇక ఈ సీరియల్ లో జగతి రోల్ ని, రిషి సర్ రోల్ ని తీసేసాక రేటింగ్ బాగా తగ్గిపోయింది. అలాగే టైమింగ్ స్లాట్ మార్చేసరికి కూడా ఆడియన్స్ చూడడం తగ్గించేశారు. అందులోనూ రిషి ప్లేస్ లో మరో పర్సన్ ని ఊహించుకోలేకపోతున్నారు..దాంతో గుప్పెడంత మనసు సీరియల్ మాత్రం అలా నెమ్మదిగా నడుస్తోంది. మొదట్లో ఉన్నంత జోష్ ఐతే ప్రస్తుతం లేదనే చెప్పొచ్చు.