English | Telugu
"ఆటగాడు" పార్టీ పెట్టిన నూకరాజు..ఎంఎల్ఏగా ఎన్నికల్లో పోటీ!
Updated : Mar 12, 2024
జబర్దస్త్ ఈ వారం షో ప్రోమో సూపర్ స్కిట్స్ తో అలరించడానికి సిద్ధమైపోయింది. ఆ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఇందులో స్టార్టింగ్ నూకరాజు స్కిట్ కంటెంట్ చూస్తుంటే మంచి టపాకాయల పేలేలా ఉంది. ఎందుకంటే ఏపీలో ఎన్నికలు రాబోతున్న విషయం తెలిసిందే. చాలామంది కొత్తకొత్త పార్టీలు పెడుతూ హడావిడి చేస్తుండడాన్ని మనం చూస్తున్నాం. ఈ కాన్సెప్ట్ తో నూకరాజు ఒక స్కిట్ రెడీ చేసాడు. అలాగే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ ఐన ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఛానల్ ద్వారా ఫేమస్ ఐన అన్వేష్ ని ఇమిటేట్ చేసాడు.
అలాగే నూకరాజు తానొక పార్టీ పెట్టానని దాని పేరు "ఆటగాడు"పార్టీ అని చెప్పాడు. అలాగే తన ఊరు నుంచి ఎంఎల్ఏగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు చెప్పాడు. తన పార్టీ గుర్తుగా "ములక్కాడను" పెట్టినట్లు బ్యానర్ల మీద అతికించి మరీ చూపించాడు. ఇక తనలాంటి ఆటగాడికి కృష్ణ భగవాన్ గారి లాంటి వేటగాడే ఓటేయాలి అంటూ ఫుల్ కామెడీ చేసి నవ్వించేసాడు. ఇక సద్దాం స్కిట్ ఎప్పుడూ రెగ్యులర్ గా ఉన్నదే చేసాడు. ఐతే పెద్దగా నవ్వొచ్చే సీన్స్ ఐతే అందులో ఏమీ లేవు. ఫైనల్ గా కెవ్వు కార్తీక్ స్కిట్ మాత్రం కొంచెం డిఫెరెంట్ గా ఉంది. అందులో ఈ మధ్య శ్రీదేవి అనే సోషల్ మీడియా పర్సన్ కమెడియన్ గా కార్తీక్ స్కిట్స్ లో చేస్తోంది. ఈ వారం స్కిట్ లో కార్తిక్ ఆమెను రెండు చేతుల్లో ఎత్తుకుని గిరగిరా తిప్పేసాడు. దాంతో శ్రీదేవికి కోపం వచ్చేసింది..ఎత్తుకునే సీన్ ఉందని కార్తీక్ ముందు చెప్పకుండా స్టేజి ఎక్కాక చెప్పారని ఇంద్రజాకు కంప్లైంట్ చేసింది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ మాత్రం "నూకరాజు, సద్దాం కొంచం కొత్తగా ట్రై చేయండి స్కిట్స్..." అంటూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు.