English | Telugu
కంటెంట్ కోసం దిగజారిన రతిక.. అందరి ముందు అలాగే ఉంటుందంట!
Updated : Sep 27, 2023
బిగ్ బాస్ హౌజ్ లో ఒక్కో కంటెస్టెంట్ నామినేషన్లో ఒక్కో వాదనని వినిపిస్తున్నారు. సోమవారం నుండి మంగళవారానికి కొనసాగిన నామినేషన్లు హీటెడ్ ఆర్గుమెంట్ల మధ్య ముగిసింది. జ్యూరీ సభ్యులుగా శోభా శెట్టి, శివాజీ, ఆట సందీప్ ఉన్నారు. ఇకపొట్టి డ్రెస్ లు వేస్తూ స్క్రీన్ స్పేస్ కావాలని రతిక రెచ్చిపోతుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కంటెంట్ కోసం ఎంత దాకైన వెళ్తానంటుంది అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అమర్ దీప్, గౌతమ్ కృష్ణ ఇద్దరిని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. కారణాలు చెప్తూ.. బిగ్ బాస్ మనకి ఇచ్చే ప్రతీ టాస్క్ చాలా విలువైనది. దానిని నువ్వు రిజెక్ట్ చేశావ్. అది నువ్వు గెలిచి ఉంటే కంటెస్టెంట్ అయ్యేవాడివని అమర్ దీప్ ని నామినేట్ చేశాడు పల్లవి ప్రశాంత్, ఇక గౌతమ్ కృష్ణ గురించి పల్లవి ప్రశాంత్ చెప్తూ.. ఆ రోజు శోభాతో నువ్వు మాట్లాడిన విధానం, ఇక హౌజ్ లో ఆడవాళ్ళ ముందు షర్ట్ లేకుండా తిరగడం బాగోలేదని పల్లవి ప్రశాంత్ చెప్పాడు.
అయితే గౌతమ్ కృష్ణ తన నుండి టాపిక్ డైవర్ట్ చేయడానికి, తను డిఫెండ్ చేసుకోలేక రతికని మధ్యలోకి లాగాడు. రతిక నువ్వు చెప్పు, చిన్న డ్రెస్ వేసుకుంటే ప్రశాంత్ ఏం అన్నాడని గౌతమ్ కృష్ణ అన్నాడు. అసలు సంబంధమే లేని ప్రశ్న.. రతికతో ప్రశాంత్ మాట్లాడిన మాటలు గౌతమ్ కి ఎందుకు అసలు, నామినేషన్లో అతడు చెప్పిందేంటంటే.. హౌజ్ లో ఆడవాళ్లు ఉన్నారు. అలా షర్ట్ తీసి బాడీ చూపించడం కరెక్ట్ కాదని, షో ఆఫ్ చేయకని శోభాని కామెంట్ చేయడం సరికాదని ప్రశాంత్ అడిగిన ప్రశ్నని వదిలేసి, మధ్యలో గౌతమ్ రతికని తీసుకురావడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇక పల్లవి ప్రశాంత్ తనని కావాలనే అలా అన్నాడని భావించిన రతిక.. నా బట్టలు నా ఇష్టం, ఇక్కడి వరకు వేసుకుంటే, అక్కడికి వరకు వేసుకుంటా అంటూమాట్లాడింది. అలా అబ్బాయిల ముందు ఇంతింత బట్టలు వేసుకొని ఉంటే బాగోదని, మనవాళ్ళు అని నేను అనుకున్నాను కాబట్టి నీకు చెప్పానని పల్లవి ప్రశాంత్ అన్నాడు. ఇక రతిక అలా అనేసరికి అందరి ముందు మరింత రెచ్చిపోయింది రతిక. నా అని ఎలా అంటావ్? నువ్వేమైనా నా తమ్ముడివా అన్నవా అని రతిక కోపంగా మాట్లాడేసరికి.. సరే అయితే ఇక నేను నిన్ను రతిక అని పిలవను అక్క, చెల్లే అని పిలుస్తానని ప్రశాంత్ అన్నాడు. దాంతో వెంటనే అలా ఏం వద్దు రతిక అని పిలవమని మన రాధిక పర్ఫామెన్స్ మొదలెట్టింది. ఇక నిన్ను రతిక అని పిలిస్తే, నీ వెంట తిరిగితే చెప్పుతో కొట్టు అని ప్రశాంత్ అన్నాడు. కంటెంట్ కోసమే రతిక ఇలా చేస్తుందని, రోజురోజుకి తనకు తెలియకుండానేదిగజారిపోతుందని సోషల్ మీడియాలో ఘాటుగానే కామెంట్స్ వినిపిస్తున్నాయి.